నా భర్త అనారోగ్యంతో కాలంజేసిండు. నాకు ఒక్క కూతురు. ఆస్తిపాస్తులు ఏమీ లేవు. కూలినాలి చేసి బిడ్డను డిగ్రీ దాకా చదివించిన. ఐదేళ్ల సంది పానం మంచిగుంటలేదు. కూలి పనికి పోతలేను. ఇంటిపట్టునే ఉంటున్న. సీఎం కేసీఆర్ సార్ ఇచ్చే ఆసరా పింఛన్‌తోనే బతుకుతున్నం. నెలనెలా రూ. 2016 వస్తున్నయ్. ఈ పైసలు రాకుంటే ఎట్ల బతికేదాన్నో ఏమో.. మా బతుకులు ఆగంకాకుండా చూసుకున్నది కేసీఆర్ సారే.. అందుకే ఏ ఎన్నిక వచ్చినా కారు గుర్తుకే ఓటేస్తా.. సార్ రుణం తీర్చుకుంటా..
-బత్తుల సరోజన, గండ్రపల్లి (జమ్మికుంట)