Women | తనను ఆర్టీసీ బస్సు కండక్టర్ కొట్టాడని ఓ మహిళ కన్నీటి పర్యంతమైంది. తాను దిగాల్సిన స్టాప్ వద్ద ఎందుకు ఆపలేదని అడిగినందుకు ఆర్టీసీ బస్సులో కండక్టర్ తనపై దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.
శంషాబాద్‌లో బస్ ఎక్కి మదన్‌పల్లి తండా వద్ద దిగాలని టికెట్ తీసుకున్నా.. మదనపల్లి వస్తుందని ముందట వచ్చి నిలబడ్డా. బస్సు ఆపమంటే ఆపకుండా స్పీడ్‌గా తీసుకొచ్చి కొత్తూరు దగ్గర ఆపాడు. అక్కడ ఆపితే దిగేదాన్ని కదా..అక్కడ ఆపకుండా కొత్తూరు వద్ద డ్రైవర్ బస్ ఆపాడు. మా ఊరు దగ్గరు ఆపనిది.. అక్కడ దిగి ఏం చేయాలి.. ఎందుకు అని అడిగినందుకు బూతులు తిడుతూ కండక్టర్ కొట్టాడని కన్నీరు పెట్టుకుంది. నేను తిడితే వీడియో తీసిండు.. మరి నన్ను కొట్టినప్పుడు వీడియో తీయాలే కదా..అంటూ వాపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట రౌండప్ చేస్తోంది.
ఆర్టీసీ బస్సులో కండక్టర్ కొట్టాడని కన్నీరు పెట్టుకున్న మహిళ
తాను దిగాల్సిన స్టాప్ వద్ద ఎందుకు ఆపలేదని అడిగినందుకు దాడి చేశాడని ఆవేదన
శంషాబాద్‌లో బస్ ఎక్కి మదన్‌పల్లి తండా వద్ద దిగాలని టికెట్ తీసుకున్నానని, అక్కడ ఆపకుండా కొత్తూరు వద్ద డ్రైవర్ బస్ ఆపాడని.. ఎందుకు అని అడిగినందుకు… pic.twitter.com/hNnCs89jSv
— Telugu Scribe (@TeluguScribe) August 23, 2026