Mark Zuckerberg | 19వ శతాబ్దపు భవంతికి 335 కోట్లు.. మెటా సీఈవో కొత్త ఇంటి ప్రత్యేకతలివే..!
Mark Zuckerberg : మెటా కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg) కొత్త ఇల్లు కొన్నాడు. ఐర్లాండ్‌లోని పురాతనమైన చిన్న భవంతిని కళ్లు చెదిరే ధరకు సొంతం చేసుకున్నాడీ సాంకేతిక దిగ్గజం
Mark Zuckerberg : మెటా కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg) కొత్త ఇల్లు కొన్నాడు. ఐర్లాండ్‌లోని పురాతనమైన చిన్న భవంతిని కళ్లు చెదిరే ధరకు సొంతం చేసుకున్నాడీ సాంకేతిక దిగ్గజం. 19వ శతాబ్ధం నాటి ఈ బంగళాను జుకర్‌బర్గ్ – ప్రిసిల్లా దంపతులు 30 మిలియన్ యూరోలు (భారతీయ కరెన్సీలో రూ. 335 కోట్లు)కు కొన్నట్టు సమాచారం. ‘స్ట్రాన్‌కల్లి క్యాస్లే’గా పిలిచే ఈ భవంతి 440 ఎకరాల ఎస్టేట్‌లో ఉంది.
సోషల్ మీడియా సంస్థలతో కోట్లు ఆర్జిస్తున్న మార్క్ జుకర్‌బర్గ్ తన రేంజ్‌కు తగ్గట్టే ఖరీదైన భవంతిని కొన్నాడు. ఐర్లాండ్‌లోని ఓ పురాతనమైన భవంతిని అతడు రూ.335 కోట్లు వెచ్చించి మరీ దక్కించుకున్నాడు. డబ్లిన్‌లోని మెటా కార్యాలయానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది భవనం. ఈ పురాతన ఇంటిని జాగ్రత్తగా చూసుకునేందుకు, ఐర్లాండ్‌లో గడిపేందుకు జుకర్‌బర్గ్ కుటుంబం ఆతృతగా ఉంది. ఇక్కడే మెటా అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం ఉంది. అందుకే వీరు ఐర్లాండ్‌తో భారీ ధరకు క్యాస్లేను కొన్నారు అని జుకర్‌బర్గ్ మీడియా ప్రతినిధి పేర్కొన్నారు.
#MarkZuckerberg has just made a big real estate purchase. The Meta CEO now owns a castle in Ireland, one for which he may have paid as much as €30 million or Rs 335 crore.https://t.co/D3Hpemz7EF
— IndiaToday (@IndiaToday) August 21, 2026
స్థానిక ఐరిష్ టైమ్స్ కథనం ప్రకారం కొన్నివారాల క్రితం జుకర్‌బర్గ్ – ప్రిసిల్లా దంపతులు మార్కెట్ ధరకు ఈ క్యాస్లేను కొన్నారు. అయితే.. వీరు రూ.335 కోట్లతో పురాతన భవంతిని కొన్నట్టు ఇంకా ర్లాండ్ ప్రాపర్టీ ప్రైస్ రిజిస్టర్లో మాత్రం నమోదు కాలేదు.
ప్రత్యేకతలివి..
జుకర్‌బర్గ్ కొన్న క్యాస్లేకు చాలా ప్రత్యేకతలున్నాయి. 19వ శతాబ్దంలో పైన్ సోదరులు దీన్ని డిజైన్ చేశారు. నది బ్యాక్ వాటర్ సమీపంలో.. ప్రకృతి అందాలతో అలరారే ఈ భవనాన్ని 1830లో జాన్ కీలీ అనే మాజీ ఎంపీ కోసం వీరు రూపొందించారు. దాదాపు 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ భవంతిలో.. కిచెన్ గది నుంచి డైనింగ్ హాల్‌కు వెళ్లడానికి కనీసం నాలుగున్నర నిమిషాలు పడుతుందట.
Mark Zuckerberg buys Strancally Castle in Ireland pic.twitter.com/urWAoCHWfl
— WPLG Local 10 News (@WPLGLocal10) August 20, 2026
25 ఏళ్లుగా ఈ క్యాస్లేలో నివాసం ఉన్న ర్యాబ్ క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు మైఖేల్ అలెన్ బక్లీ .. ఇటీవలే దీన్ని జుకర్‌బర్గ్‌కు అమ్మాడు. అమెరికాలోనే సొంతిల్లు ఉన్నప్పటికీ.. తరచూ ఐర్లాండ్ వెళ్లాల్సి రావడంతో అక్కడే ఇల్లు కొంటే బెటర్ అనుకున్నాడు జుకర్‌బర్గ్. గత వేసవి నుంచి ప్రయత్నించిన అతడు.. చివరకు మూడొందల కోట్లకు చిన్నపాటి రాజ భవనాన్ని పట్టేశాడు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

