తిరువనంతపురం: ట్రాన్స్పోర్ట్ వ్యాన్‌పై తరలిస్తున్న ఇనుప రాడ్లు ముందున్న బైకర్పై పడ్డాయి. ఆ కడ్డీలు అతడి శరీరంలోకి చొచ్చుకెళ్లడంతో అతడు మరణించాడు. సీసీటీవీలో రికార్డైన ఈ అనూహ్య ప్రమాద ఘటన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (iron rods fall on biker) కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం 10:30 గంటల సమయంలో కుట్టనెల్లూర్లోని హైలైట్ మాల్ సమీపంలోని రోడ్డుపై ఒక బైకర్ వెళ్తున్నాడు. ఒక ఆటో అడ్డురావడంతో అతడు బైక్‌ను స్లో చేశాడు. ఆ బైక్ వెనుక వస్తున్న ట్రాన్స్పోర్ట్ వ్యాన్ డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేశాడు. ఈ నేపథ్యంలో ఆ వాహనంపై తరలిస్తున్న ఐరన్ రాడ్లు జారిపడ్డాయి. ముందున్న బైకర్పై అవి పడటంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.
కాగా, స్పందించిన స్థానికులు ఆ బైకర్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే డాక్టర్లు అతడ్ని కాపాడలేకపోయారు. మృతుడిని కుట్టనెల్లూర్కు చెందిన షెరిన్ జాన్‌గా పోలీసులు గుర్తించారు. రవాణా వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Thrissur, केरल
में एक दर्दनाक सड़क हादसे का CCTV फुटेज सामने आया है, जिसमें मिनी लॉरी से गिरा एक केबल बाइक सवार के लिए जानलेवा साबित हुआ। केबल गिरने के बाद बाइक सवार उसकी चपेट में आ गया और हादसे में उसकी मौत हो गई। pic.twitter.com/zip0yy46Wo— Accident Prevention & Research Organization (@apron_india) August 22, 2026