లక్నో: ఒక స్వీట్ షాపులో కల్తీ, నాసిరకం స్వీట్లు అమ్ముతున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఆ షాపుపై రైడ్ చేశారు. కల్తీ, నాసిరకం స్వీట్లను గుర్తించారు. ఒక స్వీట్‌ను తినమని షాపు యజమానిని పోలీస్ అధికారి కోరగా అతడు నిరాకరించాడు. (UP sweet shop owner) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక స్వీట్ షాపులో కల్తీ, నాసిరకం స్వీట్లు విక్రయిస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం), ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు ఆ షాపు వద్దకు చేరుకున్నారు. అక్కడి ఉత్పత్తులను పరిశీలించి నమూనాలను సేకరించారు.
కాగా, ఒక పోలీస్ అధికారి ఒక స్వీట్‌ను చేతిలోకి తీసుకున్నారు. దానిని తినమని షాపు యజమానికి ఇవ్వగా అతడు నిరాకరించాడు. సొంత షాపులో తయారు చేసిన పదార్థమే అయినప్పటికీ దానిని తినడానికి సంశయించాడు. నిరాకరిస్తూ చేతులు జోడించాడు. కల్తీ, నాసిరకం ఆరోపణల నేపథ్యంలో ఆ స్వీట్లను పారవేయాలని ఎస్డీఎం ఆదేశించగా షాపు యజమాని వాటిని పారవేశాడు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే సొంత షాపులో తయారు చేసిన స్వీట్‌ను తినేందుకు యజమాని నిరాకరించడంపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కస్టమర్లకు అతడు ఎలాంటి స్వీట్లు అమ్ముతున్నాడోనని అనుమానాలు వ్యక్తం చేశారు.
Food safety officials raided a sweet shop in Hamirpur district. When an official asked the shopkeeper to eat his own sweets, he refused, citing poor health and saying, “These sweets are harmful to my health.” pic.twitter.com/fSU3lJTJdk
— TOI Lucknow (@TOILucknow) August 21, 2026