ముంబై: ఒక యువకుడు ఆత్మహత్య కోసం కొండ అంచు వద్ద నిల్చొన్నాడు. అక్కడి నుంచి కిందకు దూకుతానని తల్లిదండ్రులను బెదిరించాడు. వారు ఎంతగానో బతిమాలినప్పటికీ అతడు వినిపించుకోలేదు. రక్షించేందుకు తండ్రి ప్రయత్నించగా వారిద్దరూ కొండ నుంచి కిందపడ్డారు. ఇది చూసి తల్లి కూడా దూకేయడంతో ఆ ముగ్గురూ మరణించారు. (Teen On Cliff Edge) మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలోని ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో దేవ్లాయ్ ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం ఆ జిల్లాలోని ఖవ్డా కొండ వద్దకు చేరుకున్నారు.
కాగా, ఇంట్లో గొడవల వల్ల ఆ కుటుంబానికి చెందిన 18 ఏళ్ల కుమారుడు కొండ అంచు వద్ద నిల్చొన్నాడు. తాను అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటానని తల్లిదండ్రులను బెదిరించాడు. మూడు గంటలకుపైగా అక్కడే ఉన్నాడు. కుమారుడ్ని ఒప్పించి అతడ్ని వెనక్కి రప్పించేందుకు అతడి పేరెంట్స్ ఎంతగానో ప్రాధేయపడ్డారు. అతడి భవిష్యత్తు, తమ గురించి ఆలోచించమని వారు కోరారు. మూడు గంటలకుపైగా కొడుకును బతిమాలుతూనే ఉన్నారు. స్థానికులు, పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు. తల్లిదండ్రులతో పాటు వారు కూడా ఆ యువకుడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.
మరోవైపు మధ్యాహ్నం 1 గంట సమయంలో కుమారుడు కొండ అంచు వైపు కదులుతుండటం చూసి అతడి తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందారు. తండ్రి అతడికి దగ్గరగా వచ్చి నచ్చజెప్పి, కాపాడేందుకు ప్రయత్నించాడు. కొడుకును పట్టుకొనేందుకు తండ్రి ప్రయత్నించగా అదుపుతప్పి వారిద్దరూ కొండ పైనుంచి కిందపడ్డారు.
అయితే ఇది చూసి ఆందోళన చెందిన యువకుడి తల్లి కూడా ఆ వెంటనే కొండ పైనుంచి కిందకు దూకేసింది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురూ మరణించారు. పోలీసులతో పాటు స్థానికులు ఇది చూసి షాక్ అయ్యారు. ఆ ముగ్గురి మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఒక టూరిస్ట్ రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A tragic incident occurred at Khawdya Hill in Chhatrapati Sambhajinagar, resulting in the deaths of three members of the Chandwade family. Following a domestic dispute, an 18-year-old climbed a steep cliff, leading to a prolonged rescue attempt by authorities and local citizens. pic.twitter.com/Jel5Z1xqGB
— Tushar26 (@Tushar26T) August 21, 2026
खवड्या डोंगरावरील तिघांच्या मृत्यूचा दुसरा धक्कादायक व्हिडिओ समोर; तरुणाला वाचवताना वडीलही खाली कोसळले, त्यानंतर आईनेही उडी घेतल्याचे दृश्य कॅमेऱ्यात कैद..! #छत्रपतीसंभाजीनगर pic.twitter.com/FOcHMYdWLs
— Saurabh Koratkar (@saurabhkoratkar) August 21, 2026