మరికల్ : ఆర్టీసీ బస్సు టైరు పేలిన ఘటనలో ఓ మహిళకు గాయాలయ్యాయి. నారాయణ పేట డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ( RTC Bus ) హైదరాబాదు నుంచి నారాయణపేటకు వస్తుండగా మరికల్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు వద్ద టైర్ పేలి ( Tyre bursts ) హైదరాబాద్ కు చెందిన మాధవి (36) కాలుకు బలమైన దెబ్బ తగిలింది. మాధవి భర్త సంతోష్ కుమార్(39) కు స్వల్పంగా గాయపడ్డారు.
ఆర్టీసీ సిబ్బందితోపాటు ప్రయాణికులు 108కు సమాచారం ఇవ్వడంతో వారిని అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. బస్సులో 65 మంది ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. క్షతగాత్రులు బడ్డేపల్లిలో తమ బంధువులు మృతి చెందడంతో అంతక్రియలకు వెళ్తుండగా ఘటన జరిగింది .