నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ( Private Hospital ) కాన్పు కోసం వచ్చిన మహిళ ( Women ) మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. కొల్లాపూర్ మండలం ముక్కుడిగుండం గ్రామానికి చెందిన వనజ (25) అనే మహిళ రెండవ కాన్పు కోసం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి మంగళవారం వచ్చింది.
ఆమెను పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయగా మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి పరిస్థితి విషమించడంతో హుటాహుటినా హైదరాబాద్కు తరలించగా ఆసుపత్రి వద్ద వనజ మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలింత మృతి చెందిందని ఆరోపిస్తూ స్థానిక ఆసుపత్రి ఎదుట, ప్రధాన రహదారి అంబేద్కర్ కూడలి వద్దధర్నాకు దిగారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. చివరకు పోలీసుల జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో ఆందోళనను విరమించారు.