పట్టాలు దాటుతుండగారైలు ఢీకొని మహిళ మృతి
పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మహిళ మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన మలక్‌పేటలో చోటు చేసుకుంది.
కాచిగూడ,ఏప్రిల్ 28 : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మహిళ మృతి చెందింది. కాచిగూడ రైల్వే హెడ్‌కానిస్టేబుల్ సమ్మయ్య వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వృద్ధురాలు(70)మంగళవారం మలక్‌పేట-డబీర్‌పుర రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా కర్ణాటక సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో ఆ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు. వృద్ధురాలి ఒంటిపై ఆకుపచ్చ చీర, వంకాయ రంగు జాకెట్ ధరించి, ఎత్తు 5.2 ఉన్నట్లు తెలిపారు. వివరాలకు 8712658584లో సంప్రదించాలని కోరారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే కానిస్టేబుల్ తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

