చైనా సినోఫార్మ్ వ్యాక్సిన్‌కు WHO అనుమతి
చైనా సినోఫార్మ్ వ్యాక్సిన్‌కు WHO అనుమతి | చైనాకు చెందిన సినోఫార్మ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది. సినోఫార్మ్ తయారు చేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ 79శాతం సమర్థవంతంగా పని చేస్తుందని తేలింది.

జెనీవా : చైనాకు చెందిన సినోఫార్మ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది. సినోఫార్మ్ తయారు చేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ 79శాతం సమర్థవంతంగా పని చేస్తుందని తేలింది. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసే అవకాశం ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మరియంజెలా సిమో పేర్కొన్నారు. కొవాక్స్ ఫెసిలిటీలో పాల్గొని, మరింత సమానమైన వ్యాక్సిన్ పంపిణీ లక్ష్యానికి దోహదం చేయాలని మేం తయారీదారుడిని కోరుతున్నట్లు తెలిపారు. చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్ (సీఎన్‌బీజీ) అనుబంధ సంస్థ బీజింగ్ బయో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రోడక్ట్స్ కో లిమిటెడ్ సినోఫార్మ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తుంది.
టీకా 18 ఏళ్ల అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి వేసేందుకు సిఫారసు చేసింది. రెండు మోతాదుల వ్యాక్సిన్ కాగా.. మొదటి డోసు ఇచ్చిన మూడు నాలుగు వారాల వ్యవధిలో రెండో డోసు వేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా.. క్లినికల్ ట్రయల్స్‌లో 60 ఏళ్లుపైబడిన వారు పాల్గొన్నప్పటికీ టీకా వృద్ధుల్లో రక్షిత ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని డేటా సూచించనందున.. డబ్ల్యూహెచ్ఓ అత్యధిక వయస్సున్న వారికి టీకా వేసేందుకు సిఫారసు చేయలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందిన ఆరో వ్యాక్సిన్ సినోఫార్మ్. ఇప్పటి వరకు ఫైజర్, ఆస్ట్రాజెనెకా ఎస్కే బయో, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా టీకాలు ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా అత్యవసర వినియోగానికి అనుమతి పొందాయి.
ఇవి కూడా చదవండి..
న్యూజిలాండ్‌తో ఫైనల్‌కు భారత్ జట్టు ఎంపిక
Double Mask అవసరమా? సర్జికల్, క్లాత్ మాస్కుల్లో ఏది పైనుంచి పెట్టుకోవాలి?
ఈ సమ్మర్లో షుగర్ పేషెంట్స్ ఇవి ట్రై చేయొచ్చు
అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ప్రమాదం.. దంపతుల మృతి
భారత్‌కు ఆక్సిజన్ జనరేటర్లను మోసుకొస్తున్న అంటోనోవ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

