ఈ సమ్మర్లో షుగర్ పేషెంట్స్ ఇవి ట్రై చేయొచ్చు
షుగర్ పేషెంట్స్ | మధుమేహం ఒక్కసారి వస్తే ఇక అంతే! జీవితాంతం నోరు కట్టుకోవాల్సిందే !! ఏది పడితే అది తినే ఛాన్స్ ఉండదు. ఏం తినాలన్నా.. ఏది తాగాలన్నా ముందు వెనుక ఆలోచించుకోవాల్సి వస్తుంది.

మధుమేహం ఒక్కసారి వస్తే ఇక అంతే! జీవితాంతం నోరు కట్టుకోవాల్సిందే !! ఏది పడితే అది తినే ఛాన్స్ ఉండదు. ఏం తినాలన్నా.. ఏది తాగాలన్నా ముందు వెనుక ఆలోచించుకోవాల్సి వస్తుంది. అలా కాదని ఇష్టమొచ్చిన ఆహారం తింటే శరీరంలో చక్కెరస్థాయులు పెరిగిపోతాయి. అందుకే తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అలాంటి షుగర్ పేషెంట్స్ కూడా నిరభ్యంతరంగా తినగలిగే కొన్ని రకాల స్నాక్స్ ఉన్నాయి. ఈ సమ్మర్లో వీటిని ట్రై చేయడం వల్ల నోటికి రుచి దొరుకుతుంది.. అలాగే శరీరంలో షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. మరి ఆ స్నాక్స్ ఏంటో ఒకసారి చూద్దామా..

మొలకలు- పెరుగు కాంబినేషన్
మొలకలు తేలికైన ఆహారం.. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది గ్లెసెమిక్ స్థాయులను సమతుల్యం చేస్తుంది. దీనివల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. కానీ ఖాళీ మొలకలు తినడానికి చాలామంది ఇష్టపడరు. అలాంటప్పుడు ఈ మొలకలకు దోసకాయ, టమాటా, ఉల్లిగడ్డ, క్యాప్సికం ముక్కలను యాడ్ చేసి సలాడ్‌గా ట్రై చేయొచ్చు. అదే ఈ వేసవి కాలంలో కాస్త చల్లదనం కూడా కావాలనుకుంటే ఈ మొలకల సలాడ్‌కు పెరుగును కూడా కలిపి తీసుకోవచ్చు.

పెసరట్టు – రైతా
పెసరపప్పులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి డయాబెటిస్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. తరచూ కూరలకు వాడే ఈ పప్పుతో పెసరట్టు వేసుకుని రుచిగా లాగించేయొచ్చు. ఈ స్నాక్‌కి తోడు రైతా కాంబినేషన్ కూడా అదిరిపోతుంది.

ఎగ్ చాట్
చాట్ దీనికి గురించి ప్రత్యేకంగా చెప్పక్లర్లేదు. చాలామంది ఈ చాట్‌ను రుచిగా తింటుంటారు. అయితే రెగ్యులర్ చాట్నే కాకుండా ఉడకబెట్టిన గుడ్లతో కూడా చాట్ చేసుకుని మధుమేహ గ్రస్తులు రుచిగా తినొచ్చు. ఇందుకోసం ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టిన తర్వాత వాటిని ముక్కలుగా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్‌లో నూనె పోసి కోడిముక్కలను ఫ్రై చేయడంతో పాటు, కారం, మసాలా, ఉప్పు, కొత్తిమీర వేసి చాట్ చేసుకుని సాయంకాలం సరదాగా తినొచ్చు.

పండ్లతో కూల్ఫీలు
పండ్లతో చేసిన కూల్ఫీలు రుచికరంగా ఉండటమే కాదు.. రక్తంలోని షుగర్ లెవల్స్‌ను కూడా నియంత్రిస్తాయి. ఈ కూల్ఫీలు చేసుకోవడం చాలా సులువు. బెర్రీలు, ఆరెంజ్, కివీస్ వంటి పండ్లను జ్యూస్‌లా చేసి వాటికి కొన్ని నీళ్లు కలపాలి. ఆ తర్వాత ఆ జ్యూస్‌ను వివిధ ఆకారాల్లో ఉన్న ట్రేలో తీసుకుని గడ్డకట్టే వరకు డీప్ ఫ్రిజ్‌లో పెట్టాలి. తర్వాత రోజూ ఆ కూల్ఫీలను తినియొచ్చు.

దోసకాయ ముక్కలు- హమ్మస్
సమ్మర్లో దోసకాయలు శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. పైగా వీటిలో కార్బొహైడ్రేట్లు, కేలరీలు తక్కువగా ఉంటాయి. న్యూట్రిషియన్లు అధికంగా ఉంటాయి. కాబట్టి షుగర్ పేషెంట్స్ వీటిని నిరభ్యంతరంగా తినేయొచ్చు. ఈ దోసకాయ ముక్కలతో పాటు హమ్మాస్ కాంబినేషన్ కూడా బాగుంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
రోజూ పరగడుపునే కొబ్బరి నీళ్లను తాగితే..?
పొద్దు తిరుగుడు విత్తనాలను రోజూ తింటే..?
విటమిన్ డి మనకు ఎందుకు అవసరమంటే..?
చిన్నారుల్లో త్వరలో కరోనా వైరస్ కొత్త రూపం..
చిన్నారికి జ్వరమొస్తే..
తులసి విత్తనాలు రోజూ తింటే..?
కుంకుమ పువ్వు గర్భిణులకేనా?
వీటితో నోటి అల్సర్లు తగ్గించండి..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

