చిన్నారుల్లో త్వరలో కరోనా వైరస్ కొత్త రూపం.. వ్యాక్సిన్ ఇప్పించడం తప్పనిసరి
న్యూయార్క్ : చిన్నారుల్లో త్వరలో కరోనా వైరస్ కొత్త రూపంలో అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయని అమెరికాకు చెందిన వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

న్యూయార్క్ : చిన్నారుల్లో త్వరలో కరోనా వైరస్ కొత్త రూపంలో అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయని అమెరికాకు చెందిన వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు ఈ వైరస్ ఇన్ఫెక్షన్కు గురికాకుండా ఉండేందుకు వారికి కూడా కొవిడ్ వ్యాక్సిన్ ఇప్పించాలని వారు సూచిస్తున్నారు.
ప్రస్తుతం అన్ని దేశాల్లో కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నదని, పిల్లల్లో కూడా ప్రధానంగా రెండు కారణాలతో టీకాలు వేయడం అవసరమని అమెరికాలోని బ్రిఘం, ఉమెన్స్ హాస్పిటల్‌లోని అత్యవసర ఔషధ విభాగం వైద్యుడు జెరెమీ శామ్యూల్ ఫౌస్ట్, జార్జ్‌టౌన్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్లోని సెంటర్ ఫర్ గ్లోబల్ హెల్త్ సైన్స్ విభాగం వైరాలజిస్ట్ డాక్టర్ ఏంజెలా రాస్ముస్సేన్లు పేర్కొంటున్నారు.
కరోనాపై తుది యుద్ధంలో విజయం సాధించడానికి పిల్లలకు టీకాలు వేయడం చాలా అవసరమని వారు అంటున్నారు. అలా చేయనిపక్షంలో వైరస్ వేరియంట్ త్వరలో మరింత తీవ్రంగా వ్యాప్తిచెంది పిల్లలను తీవ్రంగా అనారోగ్యానికి గురిచేస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.
భారతదేశంలో దాదాపు 3 మిలియన్ల మందికి, అమెరికాలో 2 మిలియన్ల మందికి ప్రతినిత్యం కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు. రెండు దేశాలు తమ వయోజనులకు వీలైనంత త్వరగా టీకాలు వేయాలని భావిస్తున్నాయి.
పిల్లల్లో కరోనా దీర్ఘకాలిక ప్రభావాలు అన్ని కేసులు తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారని, ఇలాంటి వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పటికీ కరోనా ఇతర చెడు ప్రభావాలకు సంబంధించిన పరిస్థితి ఇంకా స్పష్టంగా తెలియలేదని వారు చెప్తున్నారు. వారిలో లక్షణాలు బయటపడకపోవడం వల్ల కరోనా గురించి తల్లిదండ్రులకు తెలియదని రెండవ కారణంగా చెప్తున్నారు.
వాస్తవానికి, వైరస్ వ్యాప్తి చెందడానికి ప్రతి అవకాశం ఉన్నది. ఇది మరింత ప్రమాదకరమైన రూపంలో పరివర్తనం చెందుతున్నది. ఇలాంటి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉత్పరివర్తనలు పిల్లలకు మరింత ఎక్కువ హానికరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
భారతదేశానికి వచ్చిన దలైలామా.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

