వీటితో నోటి అల్సర్లు తగ్గించండి..
నోటి అల్సర్లు | నోటిలో పుండ్లు అయితే ఆ బాధ వర్ణనాతీతం. ఈ నోటి పూత వల్ల ఆహారం తీసుకోవడం చాలా కష్టమైపోతుంది. ఏది తిన్నా నోరంతా మండుతుంది.

నోటి అల్సర్లు.. ఈ సమస్యను చాలా మందే ఎదుర్కొని ఉంటారు. నోటిలో పుండ్లు అయితే ఆ బాధ వర్ణనాతీతం. ఈ నోటి పూత వల్ల ఆహారం తీసుకోవడం చాలా కష్టమైపోతుంది. ఏది తిన్నా నోరంతా మండుతుంది. మన వంట గదిలో దొరికే కొన్ని ఆహార పదార్థాలతోనే ఇలాంటి నోటి అల్సర్లకు చెక్ పెట్టొచ్చు. మరి అవేంటో చూద్దాం..

తులసి ఆకులు
మన ఇంటి ముందు ఉండే తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పలు రకాల అలర్జీలు, అనారోగ్య సమస్యలను తగ్గించడంలో తులసి ఆకులు చక్కగా పనిచేస్తాయి. అందుకే రోజులో నాలుగైదుసార్లు తులసి ఆకులు నమలడం ద్వారా నోటి అల్సర్లకు చెక్ పెట్టవచ్చు. ఆకులు నమిలేటప్పుడు కొద్దిగా నీటిని తీసుకున్నట్లయితే తులసి ఆకుల రసం నోరంతా వ్యాపించి, తొందరగా ఉపశమనం కలుగుతుంది.

కొత్తిమీర
కొత్తిమీరలో మంటను తగ్గించే యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి నోటి అల్సర్ల వల్ల కలిగే నొప్పిని తగ్గిస్తాయి. కొత్తిమీర ఆకులను వేడి నీటిలో వేసి ఉడికించాలి. చల్లార్చిన తర్వాత ఆ రసంతో రోజుకు మూడుసార్లు పుకిలిస్తే సమస్య తగ్గుతుంది.

ఉల్లిగడ్డ
ఉల్లిగడ్డలోని సల్ఫర్ గుణాలు నోటి ఆల్సర్లను తగ్గించడంలో సహాయపడతాయి. చిన్న ఉల్లిగడ్డ ముక్కను అల్సర్ అయిన చోట ఉంచినా.. ఉల్లిరసంతో నోటిని పుకిలించినా ఫలితం ఉంటుంది.

తేనె
నోటి అల్సర్లను తగ్గించడంలో తేనె చక్కగా పనిచేస్తుంది. అల్సర్లు అయిన చోట తేనెను పూస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. అల్సర్ల కారణంగా నోరు పొడిబారుతుంది. అదే తేనెను పూసినప్పుడు నోరు తేమగా మారి ఉపశమనం కలుగుతుంది. తేనెలో ఉండే యాంటీమైక్రోబయాల్ గుణాల కారణంగా అల్సర్లకు కారణమయ్యే బ్యాక్టీరియా తొందరగా నాశనం అవుతుంది. ఫలితం ఇంకా తొందరగా కావాలంటే తేనెతో పాటు కొద్దిగా పసుపు కూడా రాయొచ్చు.

కొబ్బరి
నోటిలో పుండు అయిన చోట కొబ్బరి నూనెను రాయడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఎండు కొబ్బరిని నమిలినా కూడా ఫలితం ఉంటుంది. అలాగే కొబ్బరి నీళ్లు ఎక్కువ తాగడం వల్ల శరీరంలోని వేడి తగ్గి, అల్సర్ల సమస్య తగ్గిపోతుంది.

గసగసాలు
శరీరంలో వేడి అధికంగా పెరగడం వల్ల నోటి అల్సర్లు వస్తుంటాయి. కాబట్టి గసగసాలతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఒక చెంచా గసగసాలను పొడి చేసి, దానికి ఒక చెంచా చక్కెరను కలిపి.. ఆ మిశ్రమాన్ని రోజుకు రెండు మూడు సార్లు తీసుకోవాలి. దీనివల్ల అల్సర్ల సమస్య తగ్గుతుంది.

నోటి అల్సర్లు తగ్గించే మరిన్ని చిట్కాలు
- నోటి అల్సర్ల తక్షణ ఉపశమనానికి ఐస్ ముక్కలతో మర్దన చేయాలి
- తరచూ లవంగాలు నమలడం వల్ల కూడా ఆ ఘాటు వల్ల కూడా సమస్య తక్కువ అవుతుంది. కాకపోతే లవంగాల ఘాటు వల్ల మొదట మంట ఎక్కువ అవుతుంది.
- గోరువెచ్చటి నీటితో తరచూ పుకలించి ఉంచాలి.
- ఒకే బ్రష్‌ను ఎక్కువ కాలం వాడినా ఈ సమస్య వస్తుంది. అందుకే మూడు నెలలకొకసారి టూత్ బ్రష్‌ను మార్చాలని వైద్యులు సూచిస్తుంటారు.
- విటమిన్ బీ12 తగ్గినా ఈ సమస్య వస్తుంటుంది. కాబట్టి డాక్టర్ల సూచన మేరకు బీ12 విటమిన్ టాబ్లెట్లు వాడితే సమస్య పరిష్కారం అవుతుంది.
- నోటి అల్సర్లతో బాధపడేటప్పుడు టీ, కాఫీలకు దూరంగా ఉండటం మంచిది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
రోగ నిరోధక శక్తి పెంచే జ్యూస్‌లు ఇవే..
టీవీ చూస్తూ స్నాక్స్ తింటున్నారా.. జాగ్రత్త..!
మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!
వేసవిలో నిత్యం ఈ పండ్లను తప్పనిసరిగా తినాల్సిందే ఎందుకంటే..?
నిద్రకు ముందు గ్రీన్ టీ తాగితే..?
పసుపు పాలు తాగితే ఎన్ని లాభాలో..!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

