నిద్రకు ముందు గ్రీన్ టీ తాగితే..?

గ్రీన్ టీ… ఇప్పుడు చాలా మంది దీన్ని తమ నిత్యం జీవితంలో భాగం చేసుకుంటున్నారు. కారణం, అది అందించే ఆరోగ్యకర ప్రయోజనాలే. సాధారణ టీలు తాగేవారు కూడా దానికి బదులుగా గ్రీన్ టీని తాగుతున్నారు. అయితే రోజులో ఎప్పుడైనా చాలా మంది గ్రీన్ టీ తాగుతారు. కానీ రాత్రి పూట నిద్రించడానికి కనీసం గంట ముందు గ్రీన్ టీ తాగితే దాంతో కొన్ని రకాల అనారోగ్య సమస్యలను ఎఫెక్టివ్‌గా దూరం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి పూట నిద్రించడానికి గంట ముందు గ్రీన్ టీని తాగితే శరీర మెటబాలిజం బాగా పెరుగుతుంది. దీంతో నిద్ర పోతున్నా కూడా శరీరంలో ఉన్న కొవ్వు వేగంగా కరిగిపోతుంది. దీని వల్ల బరువు తగ్గుతారు.
రాత్రి నిద్రకు ముందు గ్రీన్ టీని తాగడం వల్ల ఫ్లూ, జలుబు, దగ్గు వంటి శ్వాస కోశ సమస్యలు చాలా వరకు దూరం అవుతాయని ఇటీవల చేసిన పరిశోధనల్లో వెల్లడైంది.
నిద్రించడానికి ముందు గ్రీన్ టీని తాగడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. మనసంతా ప్రశాంతంగా మారి చక్కగా నిద్ర పడుతుంది. అంతేకాదు, మరుసటి రోజు లేచే సరికి ఉల్లాసం, ఉత్తేజం కలుగుతాయి.
రోజంతా మనం తిన్న పలు ఆహార పదార్థాల కారణంగా శరీరంలో వ్యర్థపర్థాలు పేరుకుపోతాయి. వాటన్నింటినీ క్లీన్ చేయాలంటే రాత్రి పూట నిద్రకు ముందు గ్రీన్ టీని తాగాలి.
యాంటీ ఆక్సిడెంట్లు గ్రీన్ టీలో పుష్కలంగా ఉంటాయి. అయితే రాత్రి పూట నిద్రకు ముందు గ్రీన్ టీని తాగడం వల్ల ఈ యాంటీ ఆక్సిడెంట్లు తమ పని ప్రారంభిస్తాయి. దీంతో శరీరంలో అంతర్గతంగా ఉన్న అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అంతేకాదు రోగ నిరోధక వ్యవసస్థ బలపడుతుంది.
అయితే గ్రీన్ టీలో పాలు, చక్కెర వంటివి కలపకుండా డైరెక్ట్‌గా తాగాలి. అలా తాగితేనే పైన చెప్పిన విధంగా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

