చిన్నారికి జ్వరమొస్తే..
పిల్లల ఆరోగ్య విషయంలో కన్నవారికి ఆందోళన కలిగించే సమస్య జ్వరం. సహజంగా శరీర ఉష్ణోగ్రత 36-38 డిగ్రీల సెల్సియెస్ మధ్య హెచ్చుతగ్గులతో ఉంటుంది. 100.4 డిగ్రీల ఫారెన్‌హీట్ దాటినప్పుడే దాన్ని జ్వరంగా గుర్తించాలి.
శరీరంలో వ్యాధి కారకాలు ప్రవేశించినప్పుడు వాటిని ఎదుర్కొనే క్రమంలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇదొక ప్రథమ హెచ్చరిక. శరీర ఉష్ణోగ్రత 105 డిగ్రీల ఫారెన్‌హీట్ దాటితే తీవ్రమైన విషయంగా పరిగణించాలి. శరీరాన్ని లేదా నుదుటిని పట్టుకుని జ్వరం ఉందనుకోవడం నమ్మదగ పద్ధతి కాదు. జ్వరాన్ని పరీక్షించడానికి డిజిటల్ థర్మామీటర్‌ను ఉపయోగించవచ్చు. చిన్నపిల్లల్లో 5 సంవత్సరాల వయస్సు వరకూ మలద్వారంలో థర్మామీటర్ ఉంచి రికార్డు చేయడమే సరైన పద్ధతి అయినా, అన్నిసార్లూ అది వీలు కాకపోవచ్చు. చంకలో థర్మామీటర్ 2 నిమిషాలు ఉంచి చూస్తే సరిపోతుంది. ఐదేండ్ల తర్వాత నోట్లో ఉంచి చూడవచ్చు. శరీరానికి తగలకుండా చూసే ఇన్ఫ్రా రెడ్ థర్మామీటర్ సరైన ఉష్ణోగ్రతను చూపించదు. ఇది ఇంట్లో వాడటానికి పనికిరాదు.
చాలావరకు జ్వరాలకు ప్రధాన కారణం వైరస్ అంటువ్యాధులే. ఇవి వాటంతట అవే రెండు మూడు రోజుల్లో తగ్గిపోవచ్చు. జ్వరం ఉన్నప్పుడు పిల్లలు చికాకుతో ఏడుస్తుంటారు. ఈ అసౌకర్యాన్ని తగ్గించడం ముఖ్యం. జ్వరం వచ్చే ముందు ముఖం, నుదురు వేడెక్కి కండ్లు ఎర్రబడవచ్చు. చలి, వణకడం అన్నవి వైరస్ వ్యాధి లక్షణాలు. మరీ చిన్న పిల్లల్లో తలభాగం మిగతా శరీరం కన్నా వేడిగా ఉంటుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు జ్వరంలో కూడా కాళ్ళు, చేతులు చల్లగా ఉండవచ్చు. పిల్లలు ఏడ్చినప్పుడు, బాగా ఆడుకున్నప్పుడు, ఎండకాలంలో దళసరి దుస్తులు వేసినప్పుడు శరీరం వెచ్చబడుతుంది. ఇలాంటప్పుడు బట్టలు విప్పి తడిగుడ్డతో తుడిచి, ఫ్యాన్ గాలికింద ఉంచాలి. జ్వరం రికార్డు చేయకుండా జ్వరం మందులు వేయకూడదు. పిల్లల్లో శరీర ఉష్ణోగ్రత ఉదయం కన్నా మధ్యాహ్నం, సాయంకాలం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యత్యాసం వయసు పెరుగుతున్న కొద్దీ తగ్గుతుంది. చలికాలం, రాత్రిపూట, జ్వరం తగ్గిన 2-3 రోజుల పాటు శరీర ఉష్ణోగ్రత మామూలుకన్నా తక్కువ ఉండవచ్చు. నోట్లో జ్వరం చూడటానికి 15 నిమిషాల ముందు వేడి, చల్లని పదార్థాలు ఇవ్వకూడదు. జ్వరం చూస్తున్నప్పుడు నోరు పదేపదే తెరవకూడదు. జ్వరం నిర్ధారణ అయితే, ఏం చేయాలన్నది వచ్చేవారం చర్చిద్దాం!
డాక్టర్ కర్రా రమేష్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Fever
- kids Fever
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
పలు పంచాయతీల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
బెల్టుషాపుల నియంత్రణకు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీ తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం


