మాస్కో: ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో సైన్యాన్ని తరిమేందుకు రష్యా రసాయనాలను వాడుతున్నట్లు అమెరికా ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే క్లోరోపిక్రిన్(Chloropicrin) అనే రసాయనాన్ని రష్యా వాడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఉక్రెయిన్ దళాల్ని తరిమేందుకు ఈ కెమికల్‌ను వాడుతున్నారు. నైట్రోక్లోరోఫామ్ అనే రసాయనంతో ఉక్రెయిన్ దళాలను కీలక స్థావరాల నుంచి తరుముతున్నారని, యుద్ధరంగంలో వ్యూహాత్మక పైచేయి సాధించాలన్న ఉద్దేశంతో రష్యా ఆ ప్రయత్నాలు చేస్తున్నది.
ఏంటీ క్లోరోపిక్రిన్..
క్లోరోపిక్రిన్‌ను ఎక్కువగా ఓ క్రిమిసంహారకంగా వాడుతారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో దీన్ని ఓ జీవాయుధంగా వాడారు. సైనికుల్ని గాయ పరిచేందుకు .. నూనె లాంటి జిగురు పదార్ధమైన క్లోరోపిక్రిన్‌ను వాడేవారు. వాయు రూపంలో ఉండే క్లోరోపిక్రిన్.. చాలా విషపూరితమైంది. ఆ వాయువు వల్ల కండ్లలో నీళ్లు రావడం, మంట మండడం జరుగుతుంది. చర్మం కూడా మండుతుంది. ఊపిరి తిత్తులపై కూడా ప్రభావం ఉంటుంది. పెద్ద మొత్తంలో ఆ వాయువును పీల్చితే, దాని వల్ల వాంతులు, మగత వస్తుంది. ఒకవేళ క్లోరోపిక్రిన్ దాడి జరిగితే, ఆ సమయంలో సైనికుడి వద్ద గ్యాస్ మాస్క్ ఉండాల్సిందే. లేదంటే అతను చాలా వరకు ఊపిరి సమస్యతో బాధపడే అవకాశాలు ఉన్నాయి.