Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త! మెట్రో రైలు వేళలను రాత్రి 11.45 గంటల వరకు పొడిగించారు. ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకే మెట్రో టెర్మినల్ నుంచి చివరి మెట్రో ఉండేది. కానీ ఇప్పుడు చివరి మెట్రో రాత్రి 11.45 గంటలకు బయలుదేరనుంది. ఈ మార్పు ఇవాల్టి నుంచే అమలులోకి వచ్చింది. అంతేకాదు ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకే మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. మిగతా రోజుల్లో ఎప్పటిలాగే ఉదయం 6 గంటలకు మెట్రో సేవలు ప్రారంభమవుతాయి.