హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): ‘గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్ల సంగతేంటి? రాహుల్‌గాంధీ’ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ విధ్వంస పాలన సాగిస్తున్నదని, ఆ పాలనను కొనసాగించమని చెప్పేందుకే డీసీసీ అధ్యక్షుల సమావేశానికి వచ్చారా? అని నిలదీశారు.
గాంధీ విగ్రహం పెట్టేందుకు వేలాది మందిని రోడ్డున పడేస్తారా? సామాన్యుల జీవితాలను నాశనం చేయడమే ఇందిరమ్మ పాలనా? రాష్ట్రంలో గాంధీ పేరుతో జరుగుతున్న విధ్వంసం రాహుల్‌గాంధీకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. 2023లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమాయ్యాయని నిలదీశారు. రెండు లక్షల ఉద్యోగాలిస్తామని నాడు రాహుల్‌గాంధీ నిరుద్యోగులతో టీ తాగుతూ చెప్పారని గుర్తుచేశారు. నేడు అదే అశోక్‌నగర్‌లో నిరుద్యోగులకు రాహుల్ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.