మునుగోడు/చండూర్, మార్చి 4 : కరోనా మహమ్మారితో ఏర్పడిన సంక్షోభంలోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలుచేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మునుగోడు మండల కేంద్రంలో ఎంపీపీ కర్నాటి స్వామి సతీమణి పద్మకు టీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మి చెక్కును మంత్రి స్వయంగా వారి ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా మరో 12 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం తాసీల్దార్ కార్యాలయ ఆవరణలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద మంజూరైన 131 చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కరోనా సంక్షోభంతో ఇతర రాష్ర్టాలు ఉద్యోగుల జీతాలను సైతం ఇవ్వలేక ఇబ్బందులు పడ్డాయని, చాలా పథకాల్లో కోత విధించాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్‌ను సగానికి తగ్గించుకుందని అన్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితిలో సైతం సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అమలు చేస్తున్నారని, పేదల బాధలు తెలిసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చెక్కులతోపాటు నూతన వస్ర్తాలు అందజేశారు. అంతకు ముందు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో మంత్రికి స్వాగతం పలికారు. అదేవిధంగా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా నియోజకవర్గంలోని పలు మండలాల దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 5 మోటరైజ్డ్ వెహికిల్స్, 5 బ్యాటరీ వీల్చైర్లు, 4జీ సెల్‌ఫోన్, 2 ల్యాప్‌టాప్‌లను మంత్రి జగదీశ్‌రెడ్డి అందజేశారు. ఎంపీపీ కర్నాటి స్వామి, జడ్పీటీసీ నారబోయిన స్వరూపారాణి, వైస్ ఎంపీపీ అనంత వీణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, పట్టణాధ్యక్షుడు రావిరాల కుమారస్వామి, ఆర్డీఓ జగదీశ్‌రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, తాసీల్దార్ జక్కర్తి శ్రీనివాస్, ఎంపీడీఓ యాకూబ్‌నాయక్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి, మండల ప్రధాన కార్యదర్శి పగిళ్ల సతీశ్, సర్పంచ్ మిర్యాల వెంకన్న, ఎంపీటీసీలు నిర్మల, శ్రావణి, మండల కో-ఆప్షన్ సభ్యుడు రఫీక్, ఐసీడీఎస్ పీడీ సుభద్ర, సీడీపీఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.
చండూర్ : మండలాల ఏర్పాటులో భాగంగా మొదటగా ఏర్పాటు కావాల్సిన గట్టుప్పల్ మండ లం కొన్ని అనివార్య కారణాలతో నిలిచిపోయిందని, త్వరలోనే గట్టుప్పల్ మండలంగా ఏర్పడనున్నదని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని బంగారిగడ్డ, గట్టుప్పల్‌లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గట్టుప్పల్ మండలం ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, రాష్ట్రంలో చివరి మండలంగా గట్టుప్పల్ ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుర్రం మాధవి, మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళావెంకన్న, సర్పంచ్ ఇడెం రోజా, ఎంపీటీసీలు గీత, ఆనంద్, టీఆర్ఎస్ మండలా ధ్యక్ష, కార్యదర్శులు వెంకన్న, శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, అధికారులు