హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీలను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభు త్వం కుట్రలు చేస్తున్నదని రాష్ట్ర అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్(ఏటీఏ-మినీ) అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి ఆరోపించారు. అందులో భాగంగానే సర్పంచులకు అంగన్వాడీల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించిందని ఆదివారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తంచేశారు.
రాజకీయ జో క్యంతో అంగన్వాడీ టీచర్లు స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. వెంటనే సర్పంచుల కమిటీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.