హైదరాబాద్, ఫిబ్రవరి 15(నమస్తే తెలంగాణ): గడిచిన రెండేండ్లలో 588 మంది మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారని, తెలంగాణ క్యాడర్‌కు చెందిన 15 మంది సహా మిగిలిన మావోయిస్టు నాయకులు, క్యాడర్ వెంటనే లొంగిపోవాలని డీజీపీ శివధర్‌రెడ్డి పిలుపునిచ్చారు.
లొంగిపోయినవారికి పునరావాస ప్యాకేజీ అమలుచేస్తామని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.