సుబేదారి, ఫిబ్రవరి 15 : అక్షర చిట్‌ఫండ్ సంస్థ డైరెక్టర్ పేరాల శ్రీవిద్యను సుబేదారి పోలీసులు అరెస్ట్ చే శారు. ఇన్స్పెక్టర్ రంజిత్ కథనం ప్రకారం.. అక్షర చిట్‌ఫండ్ సంస్థల్లో చీటీ లు వేసిన వందలామందికి గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకపోవడం తో పలువురు బాధితులు సుబేదారి పోలీసు స్టేషన్లో సంస్థ చైర్మన్ శ్రీనివాస్‌రావు, ఆయన భార్య, డైరెక్టర్ శ్రీవిద్యపై ఫిర్యాదు చేశారు. ఇదివరకే నాలుగు కేసులు ఉండగా, రెండు కేసుల్లో శ్రీనివాస్‌రావు జైలుకు వెళ్లి వచ్చాడు.
మరో రెండు పెండింగ్ కేసు ల్లో తప్పించుకొని తిరుగుతున్నాడు. అతడి భార్య శ్రీవిద్య అమెరికా నుంచి శనివారం వస్తుండగా బెంగళూరు ఎయిర్‌పోర్టులో సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండ జిల్లా కోర్టులో హాజరుపరిచి, అక్కడి నుంచి నర్సంపేట సబ్‌జైలుకు తరలించారు.