హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని (Padi Kaushik Reddy) పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వరంగల్‌కి తరలించారు.
హనుమకొండ జిల్లా సుబేదారి పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు.