హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): హనుమకొండ జిల్లా సుబేదారి పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ కేసు కొట్టివేతకు నిరాకరించాక ఇప్పుడు ముందస్తు బెయిల్ కోరడం ఏమిటని జస్టిస్ కే లక్ష్మణ్ ప్రశ్నించారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది టీవీ రమణారావు స్పందిస్తూ.. రాజకీయ కక్షతో కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేయాలనే కుట్ర జరుగుతున్నదని వివ రించారు. నోటీసు ఇవ్వకుండా పోలీసులు అరెస్టు చేస్తే పిటిషనర్ కోర్టుకు రావచ్చని సూచిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.