Ustaad Bhagat Singh | టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్లో మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh). గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన హరీష్ శంకర్ (Harish shankar) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా.. రాశీఖన్నా కీలక పాత్రలో నటిస్తోంది.
కాగా పవన్ కల్యాణ్ పొలిటికల్ కమిట్ మెంట్స్ కారణంగా గతంలో పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్‌లో ఉన్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయని తెలిసిందే. అయితే సినిమా ఎప్పుడు విడుదలవుతుంది.. ఇంతకీ మిగిలిన అప్డేట్స్ ఎప్పుడు వస్తాయంటూ తెగ డైలమాలో పడిపోయారు అభిమానులు. తాజాగా వన్ ఆప్ ది ప్రొడ్యూపర్ రవిశంకర్ చేసిన కామెంట్స్ అభిమానులను ఎగిరిగంతేసేలా చేస్తున్నాయి.
ఆంధ్ర కింగ్ తాలూకా ఈవెంట్లో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. మీరు ఓజీని ఎంజాయ్ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ డబుల్ వినోదాన్ని అందిస్తుంది. పవన్ కల్యాణ్‌కు అభిమాని అయిన డైరెక్టర్ హరీష్ శంకర్ తన ఫేవరేట్ యాక్టర్‌కు అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందించేందుకు చాలా బాగా కష్టపడుతున్నాడన్నారు.
అంతేకాదు ఉస్తాద్ భగత్ సింగ్‌ను 2026 ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. సినిమా విడుదలయ్యాక అన్ని రికార్డులు ఉస్తాద్ భగత్ సింగ్ కిందికే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు రవి శంకర్. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలపై కూడా హింట్ రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.
ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది..
ఇప్పటికే లాంచ్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్‌లో భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ ఉస్తాద్ భగత్ సింగ్‌లో తనదైన మ్యానరిజంతో సాగుతున్న పవన్ కల్యాణ్ డైలాగ్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
“#OG entha Sensation create chesindo. #UstaadBhagatSingh Daaniki minchi chestundi.
April 1st or 2nd week release plan Chestunnam. 2026 records anni Ustaad peru meedhe.”
– Mythri Producer #RaviShankar
— Official CinemaUpdates (@OCinemaupdates) November 22, 2025
Meena | అందాల మీనా రెండో పెళ్లి ఎప్పుడు.. ఎట్టకేలకి క్లారిటీ వచ్చినట్టేనా?
Ajith Kumar | అరుదైన గౌరవం: అజిత్ కుమార్‌కు ‘జెంటిల్మన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్ 2025’ పురస్కారం!