Sai Pallavi | తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా స్థాయిలో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించిన భామల్లో ఒకరు సాయిపల్లవి. ఈ భామ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అభిమానులను పలుకరిస్తూ వారిలో జోష్ నింపుతుంటుందని తెలిసిందే. తాజాగా సాయిపల్లవి దిగిన ఓ సెల్ఫీ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ బ్యూటీ ఓ ప్రముఖ వ్యక్తితో సెల్ఫీ దిగింది. ఇంతకీ అతడెవరనే కదా మీ డౌటు..? ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత అనుపమ్ ఖేర్.
ప్రస్తుతం గోవాలో ఐఎఫ్ఎఫ్ఐ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అనుపమ్ ఖేర్ ఇన్స్టాగ్రామ్లో సెల్ఫీని షేర్ చేస్తూ.. ఐఎఫ్ఎఫ్ఐలో అందమైన సాయి పల్లవిని చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా చిన్నపాటి సమావేశంలోనే సాయిపల్లవి నిజమైన, ఆప్యాయతగల, సహజమైన, మర్యాదగల వ్యక్తిగా కనిపించింది. ఆమె చాలా ప్రతిభావంతురాలైన నటి అని నాకు తెలుసు. సాయిపల్లవి నుంచి రానున్న సినిమాలకు నా శుభాకాంక్షలు.. జై హో అంటూ క్యాప్షన్ పెట్టాడు అనుపమ్ ఖేర్. అనుపమ్ ఖేర్ ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న తెలుగు మూవీ ఫౌజీలో కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే.
అనుపమ్ ఖేర్ స్వయంగా సాయిపల్లవితో సెల్ఫీ దిగడం విశేషం. ఇక ఈ సెల్ఫీ చూసిన అభిమానులు మీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయాలని కోరుకుంటున్నారు.
Meena | అందాల మీనా రెండో పెళ్లి ఎప్పుడు.. ఎట్టకేలకి క్లారిటీ వచ్చినట్టేనా?
Ajith Kumar | అరుదైన గౌరవం: అజిత్ కుమార్కు ‘జెంటిల్మన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్ 2025’ పురస్కారం!