Gas cylinder : హైదరాబాద్లోని అమీర్పేట పరిధిలోగల మధురానగర్లో గ్యాస్ సిలిండర్ పేలి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మధ్యాహ్నం సమయంలో సిలిండర్ నుంచి గ్యాస్ లీకై ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో సోనూ బాయి అనే 40 ఏళ్ల మహిళ తీవ్రంగా గాయపడి మృతిచెందారు.
ఆమె పేరెంట్స్ గోపాల్ సింగ్, లలిత బాయికి స్వల్ప గాయాలయ్యాయి. మధురానగర్లోని ఓ భవనం మొదటి అంతస్తులో ఈ సిలిండర్ పేలుడు సంభవించింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని సిలిండర్ నుంచి వస్తున్న మంటలను ఆర్పేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.