గుండుమాల్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) , మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి( Patnam Narendhar Reddy ) పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. నారాయణపేట్ జిల్లా గుండుమాల్ ( Gundumal ) మండల కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్ నాయకులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై వెంటనే క్రిమినల్ కేసులు ( Criminal cases ) నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
బొంరాస్పేట్ కాంగ్రెస్ నాయకుల అసత్య ప్రచారాలు ఎవరూ కూడా నమ్మడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన నమస్తే తెలంగాణ పత్రికపై కొందరు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నిజాలను ప్రజల ముందుకు తీసుకువచ్చిన విషయాన్ని జీర్ణించుకోలేక విషప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు వీరారం తిరుపతి, మల్లేష్ యాదవ్, విజయ్, షహీద్, బాలప్ప, దంతే అంజి, వేపూర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.