China | బీజింగ్, మే 12: పాకిస్థాన్‌కు ఆయుధ సామగ్రితో కూడిన కార్గో విమానాలను పంపినట్టు వస్తున్న వార్తలను చైనా కొట్టిపారేసింది. ఇలాంటి అసత్య ప్రచారం చేసేవారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు చైనా రక్షణశాఖ, ఆర్మీ సోమవారం ప్రకటనలు విడుదల చేశాయి.
వై-20 మిలటరీ ట్రాన్స్పోర్ట్ విమానం ద్వారా పాకిస్థాన్‌కు చైనా ఆయుధ సంపత్తిని పంపిస్తున్నదంటూ ఇంటర్నెట్లో సమాచారం వ్యాప్తిలో ఉంది. చైనా ఆర్మీ కూడా ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న వివరాల స్క్రీన్‌షాట్స్‌పై రూమర్స్ అని పేర్కొంటూ విడుదల చేసింది. మరోవైపు చైనాలోని భారత విదేశాంగ కార్యాలయం కూడా ఓ ప్రకటన విడుదల చేసింది.
17 మందికి‘సిందూర్’ పేరు
ఖుషీనగర్, మే 12: పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ‘ఆపరేషన్ సిందూర్’ స్ఫూర్తిగా ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్లో పుట్టిన 17 మంది ఆడ శిశువులకు ‘సిందూర్’ అని పేరు పెట్టారు. ఈ మేరకు సోమవారం పీటీఐ కథనం వెల్లడించింది.