Talasani | సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటయ్యే వరకు ఉద్యమిస్తాం : మాజీ మంత్రి తలసాని
సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటయ్యే వరకు ఉద్యమిస్తాం అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
హైదరాబాద్ : సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటయ్యే వరకు ఉద్యమిస్తాం అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం శాంతియుతంగా ర్యాలీ చేస్తామంటే చేసుకోమన్న పోలీసులు ముందు రోజు రాత్రి అనుమతి నిరాకరించారన్నారు. ర్యాలీకి రాకుండా అడుగడుగునా అడ్డుకున్నారని ఆరోపించారు. భయానక వాతావరణం సృష్టించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మన నిరసన తెలపడంలో విజయవంతం అయ్యామన్నారు.
220 సంవత్సరాల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ మన అస్తిత్వం, ఆత్మగౌరవం. సికింద్రాబాద్ కార్పోరేషన్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. న్యాయస్థానం నుండి అనుమతి పొంది ఫిబ్రవరి మొదటి వారంలో వేలాదిమంది తో ర్యాలీ నిర్వహిస్తాం. ఇదే స్ఫూర్తితో పోరాటం కొనసాగిద్దాం అన్నారు. ఆందోళనకు మద్దతు తెలిపిన పార్టీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

