బీబీనగర్, డిసెంబర్ 16 : గ్రామాభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి చెందిన నూతన సర్పంచులకు సూచించారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచులు మంగళవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సర్పంచులను పైళ్ల శేఖర్ రెడ్డి శాలువాలతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కారం దిశగా కృషి చేయాలని సూచించారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు. ప్రజలు ఇచ్చిన విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పని చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యేను కలిసిన వారిలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, వెంకిర్యాల సర్పంచ్ చింతల నాగలక్ష్మి లక్ష్మీనారాయణ, రహీంఖాన్‌గూడెం సర్పంచ్ నవ్వ శృతి అరవింద్, బ్రాహ్మణపల్లి సర్పంచ్ కొలను వాణి కృష్ణారెడ్డి, చిన్నరావులపల్లి సర్పంచ్ కొమిరె శ్రీకాంత్, నాయకులు మంచాల రవికుమార్, సోము రమేశ్ ఉన్నారు.

Bibinagar : గ్రామాభివృద్ధే లక్ష్యంగా పని చేయాలి : మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి