Escalator | బంగ్లాదేశ్‌లోని ఢాకా యూనివర్సిటీ విద్యార్థులకు ఊహించని అనుభవం ఎదురైంది. వర్సిటీ క్యాంపస్ లోపల ఉన్న ఎస్కలేటర్ (Escalator) ఉన్నట్టుంటి ఒక్కసారిగా చాలా ఫాస్ట్‌గా మూవ్ అయ్యింది. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఢాకాలోని బీఆర్ఏసీ వర్సిటీ (BRAC University)లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు విద్యార్థులు ఎస్కలేటర్ సాయంతో కిందకు దిగుతున్నారు. ఆ సమయంలో ఎస్కలేటర్‌పై 20 మందిదాకా విద్యార్థులు ఉన్నారు. ఆ సమయంలో అది చాలా వేగంగా మూవ్ అయ్యింది. దీంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గట్టిగా కేకలు వేస్తూ.. కిందకు దూకారు. ఇందుకు సంబంధించిన దృష్యాలు వైరల్‌గా మారాయి. ఈ ఘటనతో అక్కడ గందరగోళం నెలకొంది. సాంకేతిక సమస్య (technical malfunction) కారణంగానే ఎస్కలేటర్ ఇలా వేగంగా మూవ్ అయినట్లు తెలిసింది.
Escalator – ❌
Rollercoaster -✅What a Ride that people just had, winderful experience
In India everywhere nd everyone should experience this Rollercoaster without spending money.Wow our india is Rapidly nd swiftly developing nd progressing.
Clap your hands 👏🏻👏🏻👏🏻#escalator… pic.twitter.com/7b2M7CEJ4v— ಕನ್ನಡ್ವಿರಾಟ (@kohlificationn) December 16, 2025
Also Read..
UNSC | ఇమ్రాన్‌ను జైల్లో పెట్టి.. మునీర్‌కు సర్వాధికారాలా.. ఐరాసలో పాక్‌ను ఎండగట్టిన భారత్