Bengals SIR Draft List | పశ్చిమబెంగాల్ (West Bengal)లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) చేపట్టిన విషయం తెలిసిందే. ప్రత్యేక ఓటరు సర్వే తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితాను (Bengals SIR Draft List) అధికారులు ఇవాళ విడుదల చేశారు. ఈ జాబితా నుంచి 58 లక్షలకు పైగా ఓట్లను అధికారులు తొలగించారు (58 Lakh Names Deleted). అందులో 24 లక్షల మంది మరణించారని, మరో 19 లక్షల మంది ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారని అధికారులు గుర్తించారు. మరో 12 లక్షల మంది తప్పిపోయారని, 1.3 లక్షల పేర్లు నకిలీవిగా గుర్తించారు. ఈ మేరకు జాబితా నుంచి ఆ పేర్లను తొలగించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.
Also Read..
Elon Musk | మస్క్ సరికొత్త రికార్డు.. 600 బిలియన్ డాలర్ల సంపద కలిగిన తొలి వ్యక్తిగా ఘనత..!
UNSC | ఇమ్రాన్‌ను జైల్లో పెట్టి.. మునీర్‌కు సర్వాధికారాలా.. ఐరాసలో పాక్‌ను ఎండగట్టిన భారత్
Statue of Liberty | బలమైన గాలులు.. నేలకూలిన స్టాట్యూ అఫ్ లిబర్టీ.. VIDEO