Goa Nightclub Fire | గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం (Goa Nightclub Fire) కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న క్లబ్ ఓనర్లు గౌరవ్ (Gaurav Luthra), సౌరభ్ లూత్రా (Saurabh Luthra)ను థాయ్‌లాండ్ పోలీసులు భారత్‌కు అప్పగించారు. ఇవాళ ఉదయం వారిని భారత్‌కు డిపోర్ట్ చేశారు (deported from Thailand to India).
ఇక లూత్రా సోదరులను (Luthra brothers) తీసుకొని భారత అధికారులు ఇండిగో విమానంలో బయల్దేరారు. ఇవాళ మధ్యాహ్నం 1:45 గంటలకు వీరు ఢిల్లీకి చేరుకోనున్నారు. లూత్రా సోదరులు ఢిల్లీలో ల్యాండ్ కాగానే గోవా పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. అనంతరం విచారణ నిమిత్తం గోవాకు తీసుకెళ్లడానికి ట్రాన్సిట్ రిమాండ్‌లో ఉంచనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. బుధవారం వారిని కోర్టు ముందు హాజరుపరిచే అవకాశముంది.
ఈనెల 6వ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత గోవాలోని అర్పోరాలోని క్లబ్, బిర్చ్ బై రోమియో లేన్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం తర్వాత కొన్ని గంటలకు లూత్రా సోదరులు ఇండిగో విమానంలో థాయ్‌లాండ్‌కు పారిపోయినట్లు అధికారులు గుర్తించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి వారి పాస్‌పోర్టులను కూడా రద్దు చేశారు. ఇక భారత ప్రభుత్వం అభ్యర్థన మేరకు థాయ్‌లాండ్ పోలీసులు ఇటీవల లూత్రా సోదరులను పుకెట్‌లో గుర్తించి అరెస్టు చేశారు. వారి గుర్తింపులు, ప్రయాణ వివరాలను ధ్రువీకరించిన అనంతరం భారత్‌కు డిపోర్ట్ చేశారు.
Also Read..
UNSC | ఇమ్రాన్‌ను జైల్లో పెట్టి.. మునీర్‌కు సర్వాధికారాలా.. ఐరాసలో పాక్‌ను ఎండగట్టిన భారత్
Mathura | దట్టమైన పొగమంచు.. బస్సులు ఢీకొని చెలరేగిన మంటలు.. నలుగురు మృతి
చనిపోయినట్టు నటించి ఏమార్చే క్యాన్సర్ కణాలు!