– నూతన సర్పంచ్ సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో 300 మంది చేరిక
– గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
రామన్నపేట, డిసెంబర్ 16 : యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన నూతన సర్పంచ్ కూనూరు సాయి కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సుమారుగా 300 మంది కాంగ్రెస్ శ్రేణులు మంగళవారం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేతుల మీదుగా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దీనికి పూర్తి బాధ్యతలు బీఆర్ఎస్ మండల నాయకుడు అంతటి పద్మా రమేశ్ గౌడ్ సారథ్యం వహించారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలో కునూరు సాయికుమార్ గౌడ్‌కి కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలియజేయక పోవడంతో ఆయన బీఆర్ఎస్లో చేరి భారీ మెజార్టీతో సర్పంచ్‌గా విజయం సాధించారు.
చిరుమర్తి లింగయ్యకు ఇచ్చిన మాట ప్రకారం గెలుపు సాధించి భారీ జన సందోహంతో మరోసారి కండువా కప్పుకుని తన జన బలాన్ని నిరూపించుకున్నారు. అనంతరం చిరుమర్తి లింగయ్య శాలువాలతో సర్పంచ్ సాయికుమార్, ఉప సర్పంచ్ బైకాని ఉమా మహేశ్, వార్డ్ మెంబర్స్ గోగు ప్రమీల రమేశ్, మేడి ఆంజనేయులు, నేరడి మానస సురేశ్, కడారి పావని పాపయ్య, వనం అండాలు యాదగిరిని ఘనంగా సన్మానించారు, ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు బద్దుల ఉమా రమేశ్ యాదవ్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Ramannapet : బీఆర్ఎస్లోకి బోగారం గ్రామ కాంగ్రెస్ శ్రేణులు