IPL 2026 Auction : ఐపీఎల్ మినీ వేలంలో కుర్రాళ్లు సైతం భారీ ధర పలుకుతున్నారు. దేశవాళీ క్రికెట్లో దంచేస్తున్న.. వికెట్ల వేటతో రెచ్చిపోతున్న ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కోటీశ్వరులను చేస్తున్నాయి. జమ్ముకశ్మీర్ పేసర్ అకీబ్ దార్ రూ.8.40 కోట్లు పలకగా.. ఉత్తరప్రదేశ్ కుర్రాడు ప్రశాంత్ వీర్ (Prashanth Veer) ఏకంగా రూ.14.20 కోట్లు కొల్లగొట్టాడు. మరో యంగ్‌స్టర్ కార్తిక్ శర్మ (Karthik Sharma)ను సైతం రూ.14.20 కోట్లకు దక్కించుకుంది చెన్నై సూపర్ కింగ్స్.
దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న కుర్రాళలు ఐపీఎల్ వేలంలో కోట్లు పలుకుతున్నారు. విధ్వంసక ఆటగాడైన ప్రశాంత్ వీర్ రూ.30 లక్షలతో వేలంలోకి రాగా.. అతడిని రూ.14.20 కోట్లకు పట్టేసింది చెన్నై సూపర్ కింగ్స్. అలానే వికెట్ కీపర్, బ్యాటర్ అయిన కార్తిక్ శర్మ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పోటీపడిన సీఎస్కే చివరకు రూ.14.20 కోట్లకు దక్కించుకుంది. నిఖార్సైన రవీంద్ర జడేజా స్థానాన్ని వీరిలో భర్తీ చేయాలనే ఉద్దేశంతోనే ప్రశాంత్, కార్తిక్లై చెన్నై ఫ్రాంచైజీ కోట్లు కుమ్మరించింది.
Prashant Veer earns BIG! ✨💛
A staggering INR 14.2 Crore for the all-rounder as he joins @ChennaiIPL 🤝#TATAIPL | #TATAIPLAuction pic.twitter.com/TOOwJ5jG4J
— IndianPremierLeague (@IPL) December 16, 2025
లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటరైన ప్రశాంత్ ఇటీవల యూపీ టీ20లో 155.34 స్ట్రయిక్ రేటుతో 320 పరుగులు సాధించాడు. బంతితోనూ రాణించి 8 వికెట్లు కూల్చాడీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆరు ఇన్నింగ్స్‌ల్లో 112 రన్స్.. బంతితోనూ తిప్పేస్తూ 9 వికెట్లు పడగొట్టాడు. 19 ఏళ్ల కార్తిక్ ఇప్పటివరకూ టీ20ల్లో 12 మ్యాచుల్లో 162.93 స్ట్రయిక్ రేటుతో 334 పరుగులు సాధించాడు.
The uncapped talents continue to shine in the #TATAIPLAuction 😎
A jaw-dropping bid of INR 14.2 Crore for Kartik Sharma 💰
He will feature in @ChennaiIPL in #TATAIPL 2026 💛 pic.twitter.com/l5fH3ONspW
— IndianPremierLeague (@IPL) December 16, 2025