KTR | SIR ను తీసుకొస్తున్నారు.. మనం జాగ్రత్తగా ఉండాలి : కేటీఆర్
KTR | SIR చాలా ముఖ్యమైన కార్యక్రమం.. మీ అందరికీ ఇచ్చిన కాగితాల్లో చాలా ముఖ్యమైన సమాచారం ఉన్నది. చదువండి.. అర్థం చేసుకోండని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సూచించారు.
KTR | తెలంగాణలో జూన్ 25 నుండి SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ను తీసుకొస్తున్నారు.. మనం జాగ్రత్తగా ఉండాలని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వేములవాడ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా SIRపై అవగాహనా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. SIR చాలా ముఖ్యమైన కార్యక్రమం.. మీ అందరికీ ఇచ్చిన కాగితాల్లో చాలా ముఖ్యమైన సమాచారం ఉన్నది. చదువండి.. అర్థం చేసుకోండని సూచించారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తేవడంతో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయారు. 95 లక్షల ఓట్లు అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసేసిందన్నారు. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ గెలుస్తదని అనుకున్నాం.. కానీ ఆ పార్టీ ఓడిపోయిందన్నారు కేటీఆర్. తమిళనాడులో స్టాలిన్ ఓడిపోయారు. ఆయన సొంత నియోజకవర్గంలో 80 వేల ఓట్లు తొలగించారు.. ఆయన 10-15 వేల ఓట్లతో ఓడిపోయారన్నారు.
బీహార్లో, పశ్చిమ బెంగాల్లో మాకు పడయ్ అనుకున్న ఓట్లు కొన్ని కట్ చేసిర్రు అని వార్తలొస్తున్నాయి. బెంగాల్లో ఈ రోజు ఈ నిమిషానికి 27 లక్షల మంది మాకు ఓటు హక్కు ఉంది కానీ మమ్మల్ని తొలగించారని వారు కోర్టులో కేసు వేశారు.. ఇంకా నడుస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. కోర్టులో నడుస్తూనే ఉన్నది.. ఇక్కడ ఎన్నికలు అయిపోయాయి. మమతా బెనర్జీ దిగిపోయింది.. ఆగమాగం అయితనే ఉన్నదన్నారు. అందుకో ముఖ్యమైంది ఒక్కొక్క ఓటు మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకా పరిస్థితి తప్పుతదనే ఉద్దేశంతో మీకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) తెచ్చి వెస్ట్ బెంగాల్లో 95 లక్షల ఓట్లు, బీహార్లో 65 లక్షల ఓట్లు తీసేశారు
తమిళనాడులో మాజీ సీఎం స్టాలిన్ సొంత నియోజకవర్గంలో 80 వేల ఓట్లు తొలగించారు.. ఆయన 10 వేల ఓట్లతో ఓడిపోయాడు
తెలంగాణలో జూన్ 25 నుండి SIRను తీసుకొస్తున్నారు.. మనం జాగ్రత్తగా… pic.twitter.com/4QmXSIZelA
— Telugu Scribe (@TeluguScribe) June 13, 2026
SIR జరిగిన ప్రాంతాల్లో బీజేపీ వాళ్లకు పడవన్న ఓట్లు అన్ని తొలగించారు
27 లక్షల మంది మాకు ఓటు హక్కు ఉంది కానీ మమ్మల్ని తొలగించారని కోర్టులో కేసు వేశారు
– కేటీఆర్ https://t.co/YF94jRCXi5 pic.twitter.com/5hHCmjUVsd
— Telugu Scribe (@TeluguScribe) June 13, 2026
Read also :
Towel Dance | ఫారెన్ రోడ్లపై యువతి టవల్ డ్యాన్స్.. భారతీయుల పరువు తీస్తున్నారని నెటిజన్ల ఫైర్
Aashirwad: 87 బంతుల్లో 103 రన్స్.. రెచ్చిపోయిన వైభవ్ సూర్యవంశీ సోదరుడు
Ram Charan| రామ్ చరణ్కు సర్జరీ .. RC17 మరింత ఆలస్యం కానుందా, ఆందోళనలో మెగా ఫ్యాన్స్!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

