ముంబై: ఇండియన్ టీమ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కుక్క పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడు తన కుక్కను పరిచయం చేస్తూ ట్విటర్లో షేర్ పోస్ట్‌కు కొన్ని గంటల వ్యవధిలోనే వేల సంఖ్యలో కామెంట్స్, లైక్స్ వస్తున్నాయి. ఇంతకీ అతడు తన కుక్కకు పెట్టిన పేరేంటో తెలుసా.. గబ్బా! ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది కదూ. క్రికెట్ లవర్స్ ఎవరూ దీనిని అంత త్వరగా మరచిపోరు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఉన్న స్టేడియం పేరు ఇది. ఇక్కడే 32 ఏళ్లుగా ఓటమెరగని కంగారూలను మట్టి కరిపించి ఇండియన్ టీమ్ చారిత్రక టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించింది.
ఈ మ్యాచ్‌తోనే అనుకోని పరిస్థితుల్లో టెస్ట్ అరంగేట్రం చేసిన వాషింగ్టన్ సుందర్ అదరగొట్టాడు. ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్తో విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీయడమే కాకుండా తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 62, రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేశాడు. అరంగేట్ర మ్యాచ్‌తోనే అతడు పెద్ద హీరో అయిపోయాడు. దీంతో తన ముద్దుల కుక్కకు గబ్బా అని పేరు పెట్టుకున్నాడు. ప్రేమ అనేది నాలుగు కాళ్ల పదం.. అంటూ తన కుక్కను అతడు పరిచయం చేశాడు.
Love is a four-legged word. World, meet Gabba! 🐾 pic.twitter.com/I1O76Jm63o
— Washington Sundar (@Sundarwashi5) April 3, 2021
ఇవికూడా చదవండి..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్.. స్టార్ ప్లేయర్‌కు కరోనా