Vivo X100 Series | ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో తన వివో ఎక్స్100 సిరీస్ ఫోన్లను వచ్చేవారం చైనా మార్కెట్లో ఆవిష్కరించనున్నది. వివో ఎక్స్100 సిరీస్ ఫోన్లలో వివో ఎక్స్100 ఆల్ట్రా, వివో ఎక్స్100ఎస్, వివో ఎక్స్100 ప్రో ఫోన్లు ఉన్నాయి. చైనాలోని తన ఆన్లైన్ స్టోర్ నుంచి ప్రీ బుకింగ్స్‌కు వివో అనుమతి ఇచ్చింది. ఈ మూడు ఫోన్లు 16 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ ఆన్ బోర్డ్ స్టోరేజీ కెపాసిటీ వరకూ కలిగి ఉంటాయి. మూడు రంగుల్లో వివో ఎక్స్100 సిరీస్ ఫోన్లు లభిస్తాయని తెలుస్తున్నది. గ్లోబల్ మార్కెట్లతోపాటు భారత్‌లో ఎప్పుడు ఆవిష్కరిస్తారన్న సంగతిని వివో వెల్లడించలేదు. చైనాలో ఈ నెల 13 సాయంత్రం ఏడు గంటలకు (భారత్ కాల మానం ప్రకారం 4.30 గంటలు) ఆవిష్కరిస్తారు. స్పేస్ గ్రే, బ్లూ క్లౌండ్, టైటానియం, వైట్ మూన్లైట్ కలర్స్‌లో వివో ఎక్స్100 సిరీస్ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్లలో జీస్ బ్రాండెడ్ కెమెరాలను వినియోగించారని తెలుస్తున్నది.
వివో ఎక్స్100 ఆల్ట్రా, వివో ఎక్స్100ఎస్ ప్రో పోన్లు మూడు ర్యామ్-స్టోరేజీ ఆప్షన్లు- 6జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ, 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ, 16 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తాయి. వివో ఎక్స్100 ఎస్ ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ, 16 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ, 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ, 16 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తాయి. వివో ఎక్స్100 ఆల్ట్రా ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర సుమారు రూ.77,500 (6699 చైనా యువాన్లు), వివో ఎక్స్100ఎస్ ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.46,200 (3999 చైనా యువాన్లు), వివో ఎక్స్100ఎస్ ప్రో ఫోన్ ధర సుమారు రూ.57,000 (4999 చైనా యువాన్లు) పలుకుతుందని చెబుతున్నారు. మే 28 నుంచి వివో ఎక్స్100 ఆల్ట్రా, మే 17 నుంచి వివో ఎక్స్100 ఎస్, వివో ఎక్స్100ఎస్ ప్రో ఫోన్ల విక్రయాలు ప్రారంభిస్తారు.