TVS Apache RTR 160 | ప్రముఖ టూ వీలర్, త్రీ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన పాపులర్ మోటారు సైకిల్ ‘టీవీఎస్ అపాచీ 160 ఆర్టీఆర్ (TVS Apache RTR 160) బ్లాక్ డార్క్ ఎడిషన్ను శుక్రవారం మార్కెట్లో విడుదల చేసింది. న్యూ రేంజ్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 బైక్ రూ.1,09,990 (ఎక్స్ షోరూమ్), టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4-వాల్వ్ బైక్ రూ.1,19,990 (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
బ్లాక్ ఫినిష్తో వస్తున్న మోటారు సైకిల్ మినిమల్ గ్రాఫిక్స్ డిజైన్, ట్యాంకుపై బ్లాక్ టీవీఎస్ లోగో, బ్లాక్డ్ ఔట్ ఎగ్జాస్ట్ పైప్ తదితర ఫీచర్లతో వస్తున్నది. తాము కొత్తగా మార్కెట్లో ఆవిష్కరించిన టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 బైక్ బోల్డర్, స్పోర్టియర్ లుక్తో వస్తోందని సంస్థ బిజినెస్ ప్రీమియం హెడ్ విమల్ సంబ్లీ చెప్పారు. నాలుగు దశాబ్దాల సుసంపన్న వారసత్వంతో ప్రపంచవ్యాప్తంగా 55 లక్షల మందికి టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 బైక్ చేరువైందన్నారు. ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా పెరుగుతున్న ప్రీమియం మోటారు సైకిళ్ల బ్రాండ్లలో ఇదొకటిగా నిలిచిందన్నారు.