e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News ప‌ల్లె ‌ప్రగతి.. ‌ఓ ‌నూత‌న ‌సమగ్ర ‌గ్రామీణ ‌విధానం: ఎర్రబెల్లి

ప‌ల్లె ‌ప్రగతి.. ‌ఓ ‌నూత‌న ‌సమగ్ర ‌గ్రామీణ ‌విధానం: ఎర్రబెల్లి

ప‌ల్లె ‌ప్రగతి.. ‌ఓ ‌నూత‌న ‌సమగ్ర ‌గ్రామీణ ‌విధానం: ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : ప‌ల్లె ‌ప్రగతి ‌కార్యక్రమం ‌ఓ ‌నూత‌న ‌సమగ్ర ‌గ్రామీణ ‌విధానం. ‌తెలంగాణ ‌గ్రామాలు దేశంలోనే ‌ఆద‌ర్శంగా ‌మారాలనేది సీఎం కేసీఆర్ ‌ఆశ‌యమని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. తెలంగాణలో స‌శ‌క్తి క‌ర‌ణ్ పుర‌స్కారాలు సాధించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.


పల్లెల్లో పచ్చదనం-పరిశుభ్రత ‌వెల్లి విరియాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్‌ ‌ఆలోచ‌న‌ల ‌మేర‌కే ఈ ప‌థ‌కం ‌అమలవుతోందని తెలిపారు. మూడు ‌విడ‌త‌లుగా ‌గ్రామాల్లో ‌పల్లె ‌ప్రగతి ‌ప్రత్యేక ‌అవగాహన, చైతన్యయాత్ర కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహించిందని తెలిపారు.

అలాగే, గ్రామాల్లో ప్రజలకు జీవన భద్రత క‌ల్పించ‌డం, నీటి ‌పారుద‌ల ప్రాజెక్టులు నిర్మించ‌డం, మిష‌న్ ‌కాకతీయ ద్వారా చెరువులు ‌బాగు ‌చేయడం, చేతి, కుల ‌వృత్తుల‌కు చేయూతనివ్వడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బ‌లోపేతం చేయ‌డం, సాగునీరు, మంచినీరు, ఆసరా పెన్షన్లు, మహిళ‌ల‌కు ‌స్త్రీ నిధి ద్వారా ‌వ‌డ్డీ లేని ‌రుణాలు ఇవ్వడం, ర‌హ‌దారుల నిర్మాణం, వ్యక్తిగత మ‌రుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం, మౌలిక వ‌స‌తుల ఏర్పాటు వంటి వాటిని ప్రభుత్వం పెంచుతున్నదన్నారు.


అందులో భాగంగానే కేంద్రం ప్రకటించిన దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ పంచాయ‌తీ స‌శ‌క్తి క‌ర‌ణ్ పుర‌స్కార్ కింద రాష్ట్రానికి 12 అవార్డులు ద‌క్కాయ‌ని ఆయ‌న అన్నారు. ఈ అవార్డులు సాధించిన సంగారెడ్డి జెడ్పీ చైర్ ప‌ర్సన్‌ మండ‌ల ప‌రిష‌త్ అధ్యక్షులు, గ్రామ‌ పంచాయ‌తీల స‌ర్పంచ్ లు, సీఈవో, ఎంపీడీఓలు, గ్రామ కార్యదర్శులు త‌దిత‌రుల‌ను హైద‌రాబాద్ కి పిలించిన మంత్రి ఖైర‌తాబాద్‌లో గ‌ల‌ రంగారెడ్డి జిల్లా ప‌రిష‌త్ లోని మంత్రి కార్యాల‌యం కాన్ఫరెన్స్‌హాలులో వారిని సత్కరించారు.


అనంత‌రం వారిని ప్రగతి భ‌వ‌న్ కి తీసుకెళ్లి, సీఎం కేసీఆర్ తో క‌లిపించారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ వారంద‌రినీ సత్కరించి అభినందించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవే పెట్టిన ప‌ల్లె ప్రగతి వంటి ప‌థ‌కాలు, ఆ ప‌థ‌కాల‌ను బాగా అమ‌లు చేస్తున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరి క‌ష్టం ఫ‌లిత‌మే ఈ అవార్డులు అని మంత్రి అన్నారు. క‌రోనా విస్తృతి నేప‌థ్యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు మ‌రింత అప్రమత్తంగా ప‌ని చేయాల‌ని మంత్రి ఆదేశించారు.

కార్యక్రమంలో పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, క‌మిష‌న‌ర్ ర‌ఘునంద‌న్ రావు, సంగారెడ్డి జెడ్పీ చైర్ పర్సన్‌ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, పాల ఉత్పత్తిదారుల సంస్థ చైర్మన్‌ లోక భూమారెడ్డి, ఆ రెండు శాఖ‌ల అధికారులు, సిబ్బంది, విజేత‌లుగా నిలిచిన స‌ర్పంచ్ లు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

విషాదం : గోదావరిలో స్నానానికి వెళ్లి ఆరుగురి మృతి

మెదక్‌ చర్చిలో భక్తి శ్రద్ధలతో ‘గుడ్‌ఫ్రైడే’

నిజామాబాద్‌ ఘటనపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి

బీజేపీ ఎమ్మెల్యే కారులో ఈవీఎంలు.. రీపోలింగ్‌కు ఈసీ ఆదేశం

వైభవంగా వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు

చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప‌ల్లె ‌ప్రగతి.. ‌ఓ ‌నూత‌న ‌సమగ్ర ‌గ్రామీణ ‌విధానం: ఎర్రబెల్లి

ట్రెండింగ్‌

Advertisement