మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 17: మంచిర్యాల సబ్ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ కార్యాలయంలో శుక్రవారం కరీంనగర్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో ఆ శాఖ ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రికార్డులను పరిశీలించారు. భూ క్రయవిక్రయాల విషయంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో విచారణ చేపట్టినట్లు సమాచారం. సేకరించిన నివేదికను సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు విజిలెన్స్ దాడులు జరుగుతాయని ముందస్తు సమాచారం మేరకు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఆవరణలోని డాక్యుమెంట్ రైటర్స్ తమ కార్యాలయాలను మూసివేశారు. ఈ దాడుల్లో ఐవోపీలు అనిల్ కుమార్, వరుణ్ ప్రసాద్, ప్రశాంత్ రావు, రవీందర్, ఎమ్మార్వో లు దినేష్ చంద్ర, శ్రీనివాస్, ఏజీ వెంకట్ రెడ్డి, కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

