Vemula Maraiah | తెలంగాణ భవన్ లో వివిధ ఆటో కార్మిక సంఘాల నేతలు సమావేశమయ్యారు. తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు
…ఆటో కార్మిక జే ఏ సి చైర్మన్ ,బీ ఆర్ టీ యూ ఆటో కార్మిక సంఘం అధ్యక్షుడు వేముల మారయ్య మాట్లాడుతూ.. ఈరోజు అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో కార్మికులు సమ్మెలోకి వెళ్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఆటో డ్రైవర్లకు అనేక హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతుంది. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఈ ప్రభుత్వం మోసం చేసింది. ఏడాదికి 12 వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తామని మోసం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద భీమా ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత రూ.5 లక్షల ప్రమాద భీమా ఎత్తేసింది. రేపు వేలాది మందితో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు భారీ ప్రదర్శన. జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని పిలుపునిస్తున్నామన్నారు.
రాష్ట్ర ప్రజలందరూ రేపటి బంద్ కు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఆటో డ్రైవర్లకు ఎటువంటి సంక్షేమ పథకాలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వమే ప్రత్యేక ఆన్ లైన్ యాప్ తెచ్చి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. రేపటి సమ్మెను కొన్ని సంఘాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. దయచేసి ఆటో డ్రైవర్లు ఎవరు ఆ సంఘాల మాటలు నమ్మకండి. ఆటో డ్రైవర్లు రేపటి సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాము.