Zombie Reddy 2 | బర్త్‌డే స్పెషల్.. తేజా సజ్జా ‘జాంబీ రెడ్డి 2’ అనౌన్స్మెంట్ వచ్చేసింది
Zombie Reddy 2 | యువ హీరో తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్ ‘జాంబీ రెడ్డి 2: నెక్స్ట్ లెవెల్’ (Zombie Reddy 2: NXT LVL) టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో విడుదలైంది.
Zombie Reddy 2 | యువ హీరో తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్ ‘జాంబీ రెడ్డి 2: నెక్స్ట్ లెవెల్’ (Zombie Reddy 2: NXT LVL) టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో విడుదలైంది. మొదటి సినిమాతో తెలుగు తెరపై జాంబీ జోనర్‌ను పరిచయం చేసిన ప్రశాంత్ వర్మ, ఇప్పుడు ఈ సీక్వెల్‌ను మరింత పెద్ద స్థాయిలో తీసుకువస్తున్నారు. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా, ఈసారి పాన్ ఇండియా స్థాయిలో భారీ మల్టీలింగ్వల్ ప్రాజెక్ట్‌గా 2027లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ ఈసారి కథను అందిస్తుండగా, ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘రాణా నాయుడు’ వంటి వెబ్ సిరీస్‌లతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సుపర్ణ్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తేజా సజ్జాతో పాటు కన్నడ స్టార్ ఉపేంద్ర ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ షనయా కపూర్ ఈ సినిమా ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ సినిమా “బిగ్గర్, బ్యాడర్ & బ్లడీర్”గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
మొదటి భాగానికి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన గౌర హరి ఈ సీక్వెల్‌కు కూడా సంగీతం అందిస్తున్నారు. హుస్సేన్ దలాల్, ప్రశాంత్ వర్మ, సుపర్ణ్ వర్మ సంయుక్తంగా ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. “డెడ్ ఆర్ అలైవ్” అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

