కొలంబో : శ్రీలంకతో(IND vs SL) ఆదివారం కొలంబో వేదికగా మొదలైన రెండో టెస్ట్‌లో భారత్ నికలడైన ఆటను ప్రదర్శిస్తోంది. దేవదత్ పడిక్కల్(61), శుభ్‌మన్ గిల్(50) అజేయ అర్ధశతకాలతో రాణించారు. ప్రస్తుతం భారత్ 50.3 ఓవర్లలో 2 వికెట్ల 185 పరుగులు చేసింది. అంతకు ముందు దూకుడుగా ఆడిన యశస్వి జైస్వాల్ (45) పరుగులు చేసి అశితా ఫెర్నాండో బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
కేఎల్ రాహుల్(18) పరుగులు చేసి వెనుదిరిగాడు. కాగా, సారాంశ్ జైన్ టీమిండియా తరఫున ఆరంగేట్రం చేశాడు. మరోవైపు ఈ పోరులోనూ నెగ్గి 2-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ 57.58 శాతంతో నాలుగో స్థానానికి ఎగబాకే అవకాశం ఉంది.