Asia Cup Final : పవర్ ప్లేలో తేలిపోయిన భారత బౌలర్లు పుంజుకున్నారు. పాకిస్థాన్‌కు షాకిస్తూ వరుసగా వికెట్లు తీస్తున్నారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ మ్యాజిక్ చేయడంతో పాక్ చూస్తుండగానే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఫర్హాన్‌ను ఔట్ చేసి వరుణ్ చక్రవర్తి తొలి బ్రేక్ ఇవ్వగా.. ఆపై కుల్దీప్ తన వంతు అన్నట్టు ఫామ్‌లో లేని ఆయూబ్(14)ను వెనక్కి పంపాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ ఓవర్లో పెద్ద షాట్ ఆడిన మొహమ్మద్ హ్యారిస్(0) లాంగాఫ్‌లో రింకూ సింగ్ చేతికి చిక్కాడు.
ఆ షాక్ నుంచి తేరుకునే లోపే హాఫ్ సెంచరీకి చేరువైన ఓపెనర్ ఫఖర్ జమాన్(46)ను వరుణ్ ఓవర్లో ఔటయ్యాడు. స్ట్రెయిట్ సిక్సర్ బాదిన ఫఖర్ ఆ తర్వాతి బంతినీ కవర్స్‌లో బౌండరీకి తలరించాలని అనుకున్నాడు. కానీ, అక్కడే కాచుకొన్న కుల్దీప్ వెనక్కి పరుగెడుతూ క్యాచ్ అందుకున్నాడు. దాంతో.. 126కే నాలుగు వికెట్లు కోల్పోయింది పాక్. 15 ఓవర్లకు స్కోర్.. 128-4.
Another wicket in the bag 👌
Varun Chakaravarthy gets his 2️⃣nd 💪
Another fine catch, this time by Kuldeep Yadav 🙌
Updates ▶️ https://t.co/0VXKuKPkE2#AsiaCup2025 | #Final | @chakaravarthy29 | @imkuldeep18 pic.twitter.com/UAAgfkApQf
— BCCI (@BCCI) September 28, 2025