Bangladesh Squad : పదిహేడ్ సీజన్ ఆసియా కప్‌లో ఫైనల్ ఆడే అవకాశాన్ని చేజార్చుకున్న బంగ్లాదేశ్ (Bangladesh) మరో సిరీస్‌కు రెడీ అవుతోంది. సూపర్ 4 చివరి పోరులో చేజేతులా ఓడిన బంగ్లా పొట్టి సిరీస్‌లో అఫ్గనిస్థాన్(Afghanistan)తో తలపడుంది. అయితే.. ఈ సిరీస్‌కు కెప్టెన్ లిటన్ దాస్ (Litton Das) దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకోని కారణంగా జకీర్ అలీ (Jaker Ali) సారథిగా ఎంపికయ్యాడు. ఆదివారం 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు సెలెక్టర్లు.
ఆసియా కప్ స్క్వాడ్‌తోనే బంగ్లాదేశ్ అఫ్గనిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల పొట్టి సిరీస్ ఆడనుంది. మెగా టోర్నీలో శ్రీలంక, అఫ్గనిస్థాన్‌ను ఓడించడంతో అదే బృందాన్ని కొనసాగించాలని సెలెక్టర్లు భావించారు. అయితే.. సారథి లిటన్ దాస్ కోలుకోనందున అతడి స్థానంలో అనుభవజ్ఞుడైన సౌమ్యా సర్కార్‌ను తీసుకున్నారు సెలెక్టర్లు. అక్టోబర్ 2 షార్జా వేదికగా బంగ్లా, కాబూలీ టీమ్ మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. అక్టోబర్ 3న రెండో టీ20, అక్టోబర్ 5వ తేదీన మూడో 20 నిర్వహించనున్నారు.
🔥 Bangladesh Squad for Afghanistan T20I Series! 🔥
🇧🇩 Jaker Ali Anik will captain the side with Litton Kumer Das still out injured.
👊 Soumya Sarkar returns as the only change from the Asia Cup squad.
📅 Matches: Oct 2, 3 & 5 | 📍 Sharjah Cricket Stadium, UAE
Squad:Jaker Ali… pic.twitter.com/SzntTn3ejs
— Bangladesh Cricket (@BCBtigers) September 28, 2025
గాయం కారణంగా లిటన్ దాస్ ఆసియా కప్ చివరి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఎంఆర్ఐ స్కాన్ తీయగా అతడి పొత్తికడుపు కండరాల్లో ఒకటి తీవ్రంగా దెబ్బతిన్నదని వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం లిటన్ కోలుకునే దశలో ఉన్నాడు. బంగ్లాదేశ్ బోర్డు వైద్య బృందం అతడి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. సో.. అతడు అఫ్గనిస్థాన్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు అని ఫిజియో బైదుల్ ఇస్లాం ఖాన్ వెల్లడించాడు.
బంగ్లాదేశ్ స్క్వాడ్ : జకీర్ అలీ(కెప్టెన్), తంజిద్ హసన్, పర్వేజ్ హొసేన్, సైఫ్ హసన్, తౌహిద్ హ్రిదయ్, షమిమ్ హొసేన్, సౌమ్యా సర్కార్, నురుల్ హసన్, రిషధ్ హొసేన్, మెహిదీ హసన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్, ముస్తాఫిజుర్, షొరిఫుల్ ఇస్లాం, మొహమ్మద్ సైఫుద్దీన్.