Asia Cup Final : ఆసియా కప్ ఫైనల్లో శుభారంభం లభించిన పాకిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. పవర్ ప్లే తర్వాత జోరు కొనసాగించి హాఫ్ సెంచరీ బాదిన ఓపెనర్ షహిబ్జద ఫర్హాన్(57)ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేశాడు. సిక్సర్ బాదిన ఫర్హాన్ అదే ఊపులో పెద్ద షాట్ ఆడి తిలక్ వర్మ చేతికి చిక్కాడు. దాంతో.. ఎట్టకేలకు వికెట్ లభించడంతో భారత ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. ఫఖర్ జమాన్( 25), ఫర్హాన్ ద్వయం తొలి వికెట్‌కు కేవలం 58 బంత్లులోనే 84 పరుగులు జోడించింది. పది ఓవర్లకు స్కోర్. 87-1. సయీం ఆయూబ్ (1) క్రీజులో ఉన్నాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు షహిబ్జద ఫర్హాన్(57), ఫఖర్ జమాన్( 25 నాటౌట్) శుభారంభమిచ్చారు. శివం దూబే వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో బౌండరీ బాదిన ఫర్హాన్ .. ఆపై బుమ్రా ఓవర్లో.. సిక్స్, ఫోర్ సాధించాడు. దాంతో పాక్ నాలుగు ఓవర్లకే 32 రన్స్ చేసింది. కుల్దీప్ ఓవర్లో సిక్సర్, రెండు పరుగులతో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడీ ఓపెనర్. అయితే.. ఐసీసీ మందలించడంతో గత మ్యాచ్‌లో మాదిరిగా గన్ సెలబ్రేషన్ కాకుండా బ్యాట్ పైకెత్తి చూపించాడు.
Varun Chakaravarthy 🤝 Tilak Varma #TeamIndia get their first wicket of the night 👌
Updates ▶️ https://t.co/0VXKuKPkE2#AsiaCup2025 | #Final | @chakaravarthy29 pic.twitter.com/qrXG4fPlDx
— BCCI (@BCCI) September 28, 2025