హుజూరాబాద్: టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు ఊరూరా మద్దతులు వెల్లువెత్తుతున్నాయి. ఏ ఊరెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాగా, సిద్దిపేట జిల్లాకు చెందిన మనోహర్ అనే యువకుడు హుజూరాబాద్‌కు వచ్చి వినూత్న ప్రచారం చేస్తున్నాడు. సీఎం కేసీఆర్ దీక్ష చేసిన, టీఆర్ఎస్ సర్కారు అమలుచేస్తున్న ప్రభుత్వ పథకాల ఫొటోలతో రూపొందించిన ఫ్లెక్సీని మెడకు తగిలించుకొని ప్రచారం చేస్తున్నాడు. 1,16,111 ఓట్ల మెజారిటీతో గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలుపు పక్కా అంటూ ఊరూరా తిరుగుతున్నాడు.