న్యూఢిల్లీ : సైన్యంలో మహిళల నియామకాలు ఇప్పుడిప్పుడే కొనసాగుతున్నది. ఇప్పటికే పలు విభాగాల్లోని కీలక పదవుల్లో నియమితులు కాగా.. ఇప్పుడు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) లో కూడా మహిళలు కీలక స్థానంలో నియమితులయ్యారు. బీఆర్ఓ తొలి మహిళా అధికారిగా వైశాలి ఎస్ హివాసే నియమితులయ్యారు. అది కూడా కీలకమైన అత్యంత ఎత్తులో ఉన్న ఇండో-చైనా సరిహద్దులోని రోడ్డు నిర్మాణ పనులను వైశాలి పర్యవేక్షించాల్సి ఉంటుంది.
వైశాలి ఎస్ హివాసే నియమాకానికి సంబంధించి బీఆర్ఓ గురువారం ట్విట్టర్ ద్వారా సమాచారం అందించింది. “ఇండో-చైనా బోర్డర్ రోడ్ కనెక్టివిటీని అందించే బాధ్యత కలిగిన రోడ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆఫీసర్ కమాండింగ్‌గా తొలి మహిళా ఆఫీసర్ ఈఈ (సివిల్) వైశాలి ఎస్ హివాసే బాధ్యతలు స్వీకరించారని తెలిపేందుకు గర్వంగా ఉంది” అని బీఆర్ఓ ట్వీట్ చేసింది. “ఇది ఆరంభం మాత్రమే. మహిళా సాధికారతకు ఇది కొత్త శకాన్ని తెస్తుందని భావిస్తున్నాం. వైశాలి బాధ్యతలు చేపట్టడంతో మహిళా అధికారులు కష్టతరమైన పనులను కూడా చేపట్టేందుకు సిద్ధంగా ఉంటారని తెలియజేస్తుంది” అని ట్వీట్లో బీఆర్ఓ పేర్కొన్నది.
మహారాష్ట్రలోని వార్దాకు చెందిన వైశాలి హివాసే ఎంటెక్ పూర్తిచేశారు. అనంతరం సైన్యంలో చేరి కార్గిల్‌లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఇటీవల ఆమెను సరిహద్దు రోడ్డు సంస్థలో కమాండింగ్ అధికారిగా నియమితులయ్యారు. ఇండో-చైనా సరిహద్దులోని పర్వత శ్రేణుల్లో రాళ్లను తొలగించి రోడ్లను నిర్మించే కఠినతరమైన బాధ్యతలను వైశాలి తన భుజానికెత్తుకున్నారు.
@BROindia feels proud to announce the #First woman Offr EE(civ) Vaishali S Hiwase for taking over as Offr Commanding of a Road Construction Company that is responsible to provide connectivity of a Indo China Border Rd.1/4@PMOIndia @RajnathSingh_in @Gen_VKSingh @drajaykumar_ias pic.twitter.com/zrIkMmoEQC
— 𝐁𝐨𝐫𝐝𝐞𝐫 𝐑𝐨𝐚𝐝𝐬 𝐎𝐫𝐠𝐚𝐧𝐢𝐬𝐚𝐭𝐢𝐨𝐧 (@BROindia) April 28, 2021
ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకినట్లు ఎలా గుర్తించాలి?
ఈ విటమిన్ సీ పండ్లు తినండి.. రోగనిరోధక శక్తి పెంచుకోండి..!
ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది ఇంటిపై ఎఫ్‌బీఐ దాడులు
కొవిడ్ చావులపై చర్చ పనికిరానిది.. చనిపోయినవారు తిరిగిరారు : సీఎం మనోహర్ లాల్ ఖట్టర్
అంతరిక్ష కేంద్రం మొదటి మాడ్యూల్‌ను ప్రయోగించిన చైనా
100 రోజుల పదవీకాలం పూర్తి చేసుకున్న జో బైడెన్
బంగ్లాదేశ్‌లో సముద్ర తుఫాను.. లక్షకు పైగా మరణం.. చరిత్రలో ఈరోజు
ఎన్నికల అధికారులపై మరణించిన అభ్యర్థి భార్య ఫిర్యాదు
5 రోజుల్లోనే నిర్మించిన తొలి 3డీ ప్రింటింగ్ ఇల్లు
ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ వచ్చినా కరోనా రావొచ్చు : డాక్టర్ రణదీప్ గులేరియా
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..